Hyderabad : KTR అంటే కోట్ల రూపాయిలు తినే రాబందు..కూకట్ పల్లి లో పోస్టర్లు దర్శనం
కేటీఆర్ అంటే కోట్ల రూపాయల తినే రాబందు అని, ఎంకేఅర్ అంటే మాధవరం కబ్జా రావు అని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల్లో పేర్కొన్నారు
- By Sudheer Published Date - 12:22 PM, Fri - 6 October 23

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ (KTR) వ్యతిరేకంగా హైదరాబాద్ కూకట్ పల్లి లో పోస్టర్లు వెలిశాయి. గత కొద్దీ నెలలుగా హైదరాబాద్ (Hyderabad) లో పోస్టర్ల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ (BJP) , కాంగ్రెస్ (Congress) , బిఆర్ఎస్ (BRS) పార్టీలు ఒకరి ఒకరు పోస్టర్ల రూపంలో విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ రోడ్డెక్కుతున్నారు. ఈ తరుణంలో తాజాగా మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనం ఇవ్వడం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
కూకట్ పల్లి (Kukatpally) నియోజకవర్గంలో గురువారం బిఆర్ఎస్ ప్రగతి నివేదన సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ (KTR) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు సభా ప్రాంగణం పక్కన, ఫ్లైఓవర్ పిల్లర్ల పై మంత్రి కేటీఆర్,కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (kukatpally MLA Madhavaram Krishna Rao) లకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేటీఆర్ అంటే కోట్ల రూపాయల తినే రాబందు అని, ఎంకేఅర్ అంటే మాధవరం కబ్జా రావు అని గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సిల్లో పేర్కొన్నారు. షేర్ లేనిదే ఏ ప్రాజెక్ట్ సాగదని, ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా..షేమ్ షేమ్ అంటూ ఫ్లెక్సీల్లో రాసుకొచ్చారు.
అభివృధ్ది పేరుతో చెరువులు,ప్రభుత్వ భూములను మయం చేస్తున్నారని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగ హామీ అమలు కు ఇంకెన్ని సంవత్సరాల సమయం పడుతుంది కేటీఆర్ గారు అంటూ ఫ్లెక్సీల్లు అంటించారు. ఈ పోస్టర్లను పోలీసులు , బిఆర్ఎస్ శ్రేణులు తొలగించి..ఈ పనిచేసిందెవరో కనుగొనే పనిలో పడ్డారు.
Read Also : Komatireddy Rajagopal Reddy : బిజెపి ని వీడడం ఫై కోమటిరెడ్డి రాజగోపాల్ క్లారిటీ