Telangana Election Results : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో బండి సంజయ్ ముందంజ
మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 9.30 నుంచి 10 గంటల మధ్య మొదటి రౌండ్ ఫలితాలు బయటికి వస్తాయి
- Author : Sudheer
Date : 03-12-2023 - 8:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Election Results ) కు సంబదించిన లెక్కింపు రోజు రానేవచ్చింది. తెలంగాణ లో కారు జోరెంత..? చేతి బలమెంత..? దుమ్ము రేపేది ఎవరు..? దెబ్బ తినేది ఎవరు..? అనేది తెలియనుంది. గత నెల 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 ఓట్లకు గానూ.. 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు వేశారు. 1 ,80 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. బరిలో నిలిచిన 2290మంది అభ్యర్ధుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 1766 టేబుల్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క సిగ్మెంట్ కు 14రౌండ్ల మేర లెక్కింపు జరుగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.
మొదట పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 9.30 నుంచి 10 గంటల మధ్య మొదటి రౌండ్ ఫలితాలు బయటికి వస్తాయి. అనంతరం 20 నిమిషాలకో రౌండ్ రిజల్ట్స్ ప్రకటించే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా ఫలితాలపై దాదాపు పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తొలుత భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల ఫలితాలు వస్తాయని ఎన్నికల అధికారులు చెప్పారు