HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ponnala Satires On Revanths Meeting With Kcr

Ponnala Lakshmaiah : కేసీఆర్ ను రేవంత్ కలవడం ఫై పొన్నాల సెటైర్లు

  • Author : Sudheer Date : 11-12-2023 - 3:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ponnala Revanth
Ponnala Revanth

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను సీఎం రేవంత్ రెడ్డి కలవడం ఫై బిఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య సెటైర్లు వేశారు. గత గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగిన సంగతి తెలిసిందే. దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఇక కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున పార్టీ నేతలు , శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు హాస్పటల్ కు వెళ్లి పరామర్శిస్తూ వస్తున్నారు.

ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ..యశోద హాస్పటల్ కు వెళ్లి కేసీఆర్ ను పరామర్శించారు. ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని కోరారు. కేసీఆర్ ను రేవంత్ కలవడం ఫై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఇది శుభపరిణామమని, రాజకీయాలతో సంబంధం లేకుండా రేవంత్ స్వయంగా వెళ్లి పరామర్శించడం ఎంతో గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాత్రం రేవంత్ కలవడం ఫై సెటైర్లు వేసి..విమర్శల పాలవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

రేవంత్ రెడ్డి పరామర్శ ఫొటోలను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని సెటైరికల్ క్యాప్షన్ ఇచ్చారు పొన్నాల. నన్ను కనీసం ఏడాది పాటు అయినా సీఎంగా ఉండనివ్వండి కేసీఆర్ గారు.. అంటూ వేడుకుంటున్నాడని క్యాప్షన్ ఇచ్చారు పొన్నాల. పొన్నాల పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పలువురు నెటిజన్స్ పొన్నాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటె కొద్దీ సేపటి క్రితం సినీ నటుడు ప్రకాష్ రాజ్..కేసీఆర్ ను కలిశారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తో పాటు కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ లు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మోత్కుపల్లి., చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు ఉన్నారు.

Read Also : Salaar Censor Talk : సలార్ సెన్సార్ టాక్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • Ponnala
  • revanth reddy

Related News

Kalvakuntla Kavitha lashes out at KTR.

kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా

  • Telangana's debt stands at a staggering Rs 8.21 lakh crore; Bhatti Vikramarka lashes out at BRS.

    Bhatti Vikramarka: తెలంగాణ అప్పు అక్షరాలా రూ.8.21 లక్షల కోట్లు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd