T Congress First List : కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లో పొంగులేటి, తుమ్మలకు నో ఛాన్స్..
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు ల పేర్లు ప్రకటించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు నుండి పొంగులేటికి టికెట్స్ ఇస్తారని అంతా అనుకున్నారు.
- By Sudheer Published Date - 10:57 AM, Sun - 15 October 23
కాంగ్రెస్ శ్రేణులు , నేతలే కాదు ఇతర పార్టీల వారు సైతం తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ (T Congress Candidates First List) కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Assembly Election 2023) కు రెండు నెలలు కూడా లేకపోవడం తో అభ్యర్థుల లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారా..? ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు..? ఎవరెవరికి టికెట్స్ దక్కుతాయో..? అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు (అక్టోబర్ 15 ) 55 మందితో కూడిన లిస్ట్ ను ప్రకటించారు. వామపక్షాలతో పొత్తుపై ఈరోజు స్పష్టత రానుంది. అనంతరం మిగతా స్థానాలపై చర్చించి బుధ, గురువారాల్లో రెండో జాబితాను విడుదల చేయనున్నట్లు సమాచారం
ఫస్ట్ లిస్ట్ లో పొంగులేటి, తుమ్మలకు (Thummala Nageswara Rao, Ponguleti Srinivasa Reddy) నో ఛాన్స్
కాంగ్రెస్ ప్రకటించిన 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District) కీలక నేతలు , ఇటీవలే బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లోకి చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు ల పేర్లు ప్రకటించలేదు. ఖమ్మం నుంచి తుమ్మలకు, పాలేరు (Thummala Nageswara Rao, Ponguleti Srinivasa Reddy) నుండి పొంగులేటికి టికెట్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ స్థానాలపై హైకమాండ్ ఇంకా స్పష్టతకు రాకపోవడం.. మరోవైపు పాలేరు సీటు తమకు ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుండటం వల్ల ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.
మరోవైపు వామపక్షాలతో కాంగ్రెస్ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు. సీపీఐ, సీపీఎంకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్తగూడెం, చెన్నూర్ సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించగా.. చెన్నూర్ బదులు బెల్లంపల్లి ఇవ్వాలని సీపీఐ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు పాలేరు, మిర్యాలగూడ ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు స్థానాల వద్ద ఇంకా ఏది డిసైడ్ కాకపోవడం తో ఆ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించలేదు.
రెండు టికెట్స్ దక్కించుకున్న ఫ్యామిలీస్ ..
బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిన మైనంపల్లి హనుమంతురావు (Mynampally Hanumanth Rao) కు రెండు టికెట్స్ ను కాంగ్రెస్ కేటాయించింది. మల్కాజ్ గిరి టికెట్ మైనంపల్లి హనుమంతురావు కు ఇవ్వగా..మెదక్ టికెట్ మైనంపల్లి రోహిత్ రావు కు ఇచ్చింది.
అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ (Uttam Kumar Reddy Family) కి రెండు టికెట్స్ ను కేటాయించింది అధిష్ఠానం. హుజూర్నగర్ స్థానంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగగా, కోదాడ స్థానం నుండి ఉత్తమ్ సతీమణి నలమాద పద్మావతిరెడ్డి బరిలోకి దిగుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పొత్తుల్లో భాగంగా వామపక్షాలు భద్రాచలం టికెట్‌ను డిమాండ్ చేసినప్పటికీ.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకే మళ్లీ ఆ స్థానం కేటాయించారు. ఇక నాగార్జున సాగర్ టికెట్ ను జానారెడ్డి కి బదులు ఆయన కొడుకు కుందూరు జయవీర్ కు ఇచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా (T Congress Candidates First List) చూస్తే..
బెల్లంపల్లి (ఎస్సీ) – గడ్డం వినోద్
మంచిర్యాల – ప్రేమ్‌సాగర్ రావు
నిర్మల్ – శ్రీహరి రావు
ఆర్మూర్ – ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి
బోధన్ – సుదర్శన్ రెడ్డి
బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల
జగిత్యాల – జీవన్ రెడ్డి
ధర్మపురి (ఎస్సీ) – లక్ష్మణ్ కుమార్
రామగుండం – రాజ్ ఠాకూర్
మంథని – దుద్దిళ్ల శ్రీధర్ బాబు
పెద్దపల్లి – చింతకుంట విజయ్ రమణారావు
వేములవాడ – ఆది శ్రీనివాస్
మానకొండూరు (ఎస్సీ) – కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
అందోల్ (ఎస్సీ) – దామోదర రాజనర్సింహ
జహీరాబాద్ (ఎస్సీ) – ఆగం చంద్రశేఖర్
సంగారెడ్డి – జగ్గారెడ్డి
గజ్వేల్ – తూముకుంట నర్సారెడ్డి
మేడ్చల్ – తోటకూర వజ్రేశ్ యాదవ్
మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కొలన్ హన్మంత్ రెడ్డి
ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి
చెవేళ్ల (ఎస్సీ) – భీమ్‌భరత్
పరిగి – టి. రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
ముషీరాబాద్ – అంజన్‌కుమార్ యాదవ్
మలక్‌పేట – షేక్ అక్బర్
సనత్‌నగర్ – కోట నీలిమ
నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
కార్వాన్ – ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్‌హజ్రి
గోషామహల్ – మొగిలి సునీత
చాంద్రయణగుట్ట – బోయ నగేశ్ (నరేశ్)
యాకత్‌పుర – కె. రవి రాజు
బహదూర్‌పుర – రాజేశ్ కుమార్ పులిపాటి
సికింద్రాబాద్ – ఎ.సంతోష్ కుమార్
కొడంగల్ – రేవంత్ రెడ్డి
గద్వాల – సరితా తిరుపతయ్య
అలంపూర్ (ఎస్సీ)- సంపత్ కుమార్
నాగర్‌కర్నూల్ – కె. రాజేశ్ రెడ్డి
అచ్చంపేట్(ఎస్సీ) – సీహెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ్ రెడ్డి
షాద్ నగర్ – కె. శంకరయ్య
కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
నాగార్జున సాగర్ – కుందూరు జయవీర్
హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్‌రెడ్డి
కోదాడ – పద్మావతి రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నకిరేకల్ (ఎస్సీ)- వేముల వీరేశం
ఆలేరు – బీర్ల ఐలయ్య
స్టేషన్ ఘన్పూర్ (ఎస్సీ) – సింగాపురం ఇందిర
నర్సంపేట – దొంతి మాధవ్ రెడ్డి
భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ రావు
ములుగు (ఎస్టీ) – సీతక్క
మధిర (ఎస్సీ)- మల్లు భట్టి విక్రమార్క
భద్రాచలం – పొదెం వీరయ్య
Read Also : BRS Manifesto : కాసేపట్లో బీఆర్ఎస్ మేనిఫెస్టో.. రైతులు, మహిళలపై వరాల జల్లు!
Tags
Related News
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా