Political Leaders Nominations : ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన పలువురు రాజకీయ నేతలు
నామినేషన్ వేయడానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండడం తో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు పోటీ పడుతున్నారు. ఈరోజు గురువారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల నేతలు నామినేషన్ వేయడం చేస్తున్నారు.
- Author : Sudheer
Date : 09-11-2023 - 12:49 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల (Nominations ) పర్వం ఊపందుకుంది. నామినేషన్ వేయడానికి ఇంకా 48 గంటలు మాత్రమే సమయం ఉండడం తో అభ్యర్థులంతా నామినేషన్ వేసేందుకు పోటీ పడుతున్నారు. ఈరోజు గురువారం మంచి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో అన్ని పార్టీల నేతలు నామినేషన్ వేయడం చేస్తున్నారు. ఈరోజు ఇప్పటివరకు నామినేషన్ వేసిన అభ్యర్థులను చూస్తే..
* గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన నామినేషన్ పత్రాలను ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మరికాసేపట్లో కామారెడ్డి కి చేరుకొని అక్కడ కూడా కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈసారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డి లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే.
* మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన మంత్రి.. పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
* సిరిసిల్ల నుంచి ఐదోసారి బరిలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
* వనపర్తి నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Nirajan Reddy) వనపర్తి ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.
* మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేటలోని ఆర్వో కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు.
* తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
Read Also : T Congress Minority Declaration : కాసేపట్లో మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్న కాంగ్రెస్