HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Shock Crackers

Diwali Crackers : ఆ సమయంలోనే క్రాకర్స్ కాల్చాలంటూ పోలీసుల హెచ్చరిక

Police shock : దీపావళి పండుగ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు

  • Author : Sudheer Date : 27-10-2024 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diwali Safety Tips
Diwali Safety Tips

దీపావళి (Diwali ) పండుగ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు (HYD Police) ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు 55 డెసిబెల్స్‌ లోపు శబ్దం చేసే టపాసులను మాత్రమే అనుమతించారు.

ఈ నిబంధనల ప్రకారం:

కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఉంటుంది. 55 డెసిబెల్స్‌ కంటే ఎక్కువ శబ్దం చేసే టపాసులు పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలను అతిక్రమిస్తే, నిబంధనలను అతిక్రమించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న ఈ చర్యలు పర్యావరణ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్నవని అధికారులు తెలిపారు.

దీపావళి, దీపోత్సవం లేదా దీపావళి పండుగ హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి. దీపావళి అంటే “దీపాల వరుస” ఇది వెలుగుల పండుగగా కూడా ప్రసిద్ధి. ఇది అంధకారాన్ని తొలగించి వెలుగులు మరియు శుభశాంతి నింపే సంకేతంగా భావిస్తారు. ఈ పండగను జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.

చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.

సాధారణంగా దీపావళి కార్తీక అమావాస్య రోజున సాయంకాలం సూర్యాస్తమయం తరువాత లక్ష్మీ పూజ చేస్తారు. కానీ ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమై, నవంబర్ 1 సాయంత్రం 5:53 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు అమావాస్య ముగియడం వల్ల, పూజ సమయం గురించి అందరు అయోమయం అవుతున్నారు. ఆచార సాంప్రదాయాల ప్రకారం, అక్టోబర్ 31 సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.

అలాగే పూజా (Diwali Laxmi Puja 2024) సమయాలు చూస్తే..

లక్ష్మీ పూజ ముహూర్తం: అక్టోబర్ 31, 2024న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు

అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 31, 2024న మధ్యాహ్నం 03:52

అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 01, 2024న సాయంత్రం 06:16 గంటలకు.

Read Also : Rave Party : జన్వాడ రేవ్ పార్టీ లో కేటీఆర్ సతీమణి శైలిమా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • diwali
  • diwali crackers
  • hyderabad
  • Police shock crackers

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd