Pm Modi Tour: తెలంగాణలో మోడీ టూర్ ఫిక్స్.. వివరాలు ఇదిగో!
మోడీ (PM Modi) తెలంగాణ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది.
- By Balu J Published Date - 04:43 PM, Sat - 21 January 23

భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తెలంగాణ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 13న ప్రధాని మోడీ హైదరాబాద్ (Hyderabad) కు రానున్నారు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు ఆయన (PM Modi) శంఖుస్థాపన చేయనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగసభలో పాల్గొంటారు. కాగా ఈ నెల 19 నే మోడీ హైదరాబాద్ కు రావాల్సి ఉండింది.
అయితే అనివార్య కారణాలతో ఆ పర్యటన వాయిదా పడింది. దాంతో 15 వ తేదీన సికిందరాబాద్ నుంచి విశాఖకు వెళ్ళే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ఢిల్లీ (PM Modi) నుంచే వర్చువల్ గా ప్రారంభించారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడానికి రేపటి నుంచి తెలంగాణలో కేంద్ర మంత్రులు (Central Ministers) పర్యటించనున్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మెదక్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తారు. మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేవెళ్ళ పార్లమెంటు పరిధిలో 23, 24 తేదీల్లో పరటిస్తారు.
Also Read: Kantara 2 confirmed: కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో ‘కాంతార 2’