Pawan Kalyan Election Campaign : పవన్ అన్న ఎక్కడ..? తెలంగాణ అభ్యర్థుల ఆవేదన..!
అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు..పవన్ కళ్యాణ్ పేరు ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం బిఆర్ఎస్ - కాంగ్రెస్ జై అంటున్నారు
- Author : Sudheer
Date : 14-11-2023 - 11:59 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల పోలింగ్ (TS Polls) సమయం దగ్గరికి వచ్చింది..పట్టుమని 20 రోజులు కూడా లేదు. ఓ పక్క అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) పార్టీలు జోరుగా తమ అభ్యర్థుల గెలుపుకు ప్రచారం చేస్తూ..దూకుడు మీద ఉంటె..బిజెపి – జనసేన పార్టీలు మాత్రం నామమాత్రపు ప్రచారం చేస్తూ వస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలు , నేతలు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ (Janasena) మద్దతు బీజేపీ (BJP)కి ప్రకటించడం తో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అంత అనుకున్నారు. అలాగే ఆ పార్టీ నుండి 8 మంది బరిలో నిల్చున్నారు. తమ అధినేత (Pawan Kalyan) తమకోసం వస్తారని..తమ నియోజకవర్గాలలో పర్యటిస్తారని భావించారు. కానీ అధినేత మాత్రం సైలెంట్ గా ఉన్నారు.
అభ్యర్థులు నామినేషన్లు వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు..పవన్ కళ్యాణ్ పేరు ఒకటికి పదిసార్లు చెప్పుకొస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం బిఆర్ఎస్ – కాంగ్రెస్ జై అంటున్నారు తప్ప జనసేన జై అని మాత్రం ఎవ్వరు అనడం లేదు. అంతే కాదు ప్రచారంలోనూ పది మంది తప్ప పదుల సంఖ్యలో కూడా జనాలు ఉండడం లేదు. దీంతో బరిలోకి దిగిన అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారైనా పవన్ వచ్చి ప్రచారం చేస్తే తప్ప జనాల్లోకి వెళ్లలేం అని మాట్లాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
జనసేన నేతలంతా దాదాపుగా రాజకీయాలకు కొత్త వారే. ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అనుభవం లేని వారే. ఈ కారణంగా వారు ఎన్నికల ప్రచారాన్ని ఇతర పార్టీలతో సమానంగా చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. జనసేన పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్న కూకట్ పల్లి, ఖమ్మం, కోదాడ , తాండూరు వంటి చోట్ల.. రెండు పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టం గా కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తూ.. అభ్యర్థులకు ప్రచారం చేయకపోతే పవన్ కల్యాణ్‌పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పవన్ ఖచ్చితంగా ప్రచారం చేస్తారని అంటున్నారు. రెండు, మూడు రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షో చేసి అభ్యర్థులకు నైతిక బలం ఇస్తారన్న అభిప్రాయం జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రచార గడువు ముగియడానికి మూడు, నాలుగురోజుల ముందు నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని అంటున్నారు. కానీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిదని కార్యకర్తలు అంటున్నారు. మరి నిజంగా పవన్ ప్రచారం చేస్తారా..? ప్రచారం చేస్తే అధికార పార్టీ బిఆర్ఎస్ , కాంగ్రెస్ ల ఫై ఎలాంటి విమర్శలు చేస్తారు..? అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన బిసి సభ లో పవన్ ప్రత్యర్థి పార్టీల ఫై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ఎంతసేపు మోడీ భజన సేవే చేసాడుతప్ప మరో కామెంట్ చేయలేదు. అందుకే ప్రచారంలో పవన్ ఇలాంటి విమర్శలు చేస్తారో చూడాలని అంత ఎదురుచూస్తున్నారు.
Read Also : Revanth Reddy Secret Meeting with CBN : చంద్రబాబు తో రేవంత్ భేటీ..?