HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pawan Kalyan To Undertake Tour Of Telangana

Pawan Kalyan: త్వరలో తెలంగాణలో ‘పవన్’ పర్యటన!

పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

  • Author : Hashtag U Date : 19-04-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే తెలంగాణ ప్రాంతంలో పర్యటిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు క్రియాశీలక జనసైనికుల కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చెక్కులు అందిస్తారని వెల్లడించారు. హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఉదయం తెలంగాణ నాయకులు, వీరమహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రాంతమన్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలన్నా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి చాలా మక్కువ. ఈ ప్రాంత పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి సమావేశంలో ఆయన ప్రస్తావిస్తూనే ఉంటారు. ఈ ప్రాంతంలో పేదరికం, వెనుకబాటుతనం, సమస్యలు స్వయంగా చూశారు. ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆయనకు తెలుసు. అందుకనే ఆదిలాబాద్ తండాలో అక్కడి మహిళలు అడగ్గానే మంచినీటి బోరు ఏర్పాటు చేశారు. కోరుకుంటే నాయకత్వం రాదు. దానికోసం మనస్ఫూర్తిగా కష్టపడాలి. ఒక ప్రణాళికతో వ్యూహాత్మకంగా ప్రజా సమస్యలపై గళం వినిపించాలి. అప్పుడు సమస్యలపై అవగాహన పెరగడంతో పాటు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు నాదెండ్ల మనోహర్.

ఆదుకోవడం మన బాధ్యత:

చౌటుప్పల్, హుజూర్ నగర్ ప్రాంతాలకు చెందిన సైదులు, కడియం శ్రీనివాస్ అనే జనసైనికులు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని నమ్మి మనతో పాటు ఇన్నాళ్లు ప్రయాణించారు. ఇటీవల ప్రమాదవశాత్తు వాళ్లిద్దరు మరణించారు. ఆ కుటుంబాలను ఆదుకొని, వారికి భరోసా కల్పించే బాధ్యత మనపై ఉంది. మరో వారం పది రోజుల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ కుటుంబాలను పరామర్శించి, బీమా సాయం అందిస్తారు. జనసేన పార్టీకి తెలంగాణలో బలం లేదని కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో తప్ప మిగిలిన చోట్ల పట్టులేదని అంటున్నారు. వాళ్లకు మన బలం గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఒక్క సరిహద్దు ప్రాంతాలే కాదు గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో బలమైన కార్యకర్తలు, జనసైనికులు ఉన్నారు. ఆయన చేసిన మంచి పనులు, రాజకీయాల్లో మార్పు కోసం పడుతున్న తపన చూసి యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. అయితే ఇతర రాజకీయ పార్టీలతో పోల్చుకుంటే మాత్రం జనసేన పార్టీ కార్యక్రమాలు కాస్త భిన్నంగా ఉంటాయి. విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తాం తప్ప ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు చేసే పార్టీ మాత్రం కాదు అని అన్నారు నాదెండ్ల మనోహర్.

క్షేత్రస్థాయిలో బలపడేలా చేద్దాం:

గత సార్వత్రిక ఎన్నికల్లో చివరి నిమిషంలో పోటీ చేద్దామని భావించి కొన్ని చోట్ల మాత్రమే అభ్యర్ధులను పోటీకి నిలబెడితే దాదాపు లక్షన్నర ఓట్లు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే బలమైన ఓటు బ్యాంకే సాధించాం. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా అదే విధంగా చేపట్టాలి. క్రియాశీలక సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి అర్ధమయ్యే విధంగా వివరించాలి. నల్గొండ జిల్లాలో 13 వందల సభ్యత్వాలు నమోదయ్యాయి. అదే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా సభ్యత్వాలు నమోదయ్యేలా అందరు కలసికట్టుగా కృషి చేయాలని” కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్, పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ఇంఛార్జ్ రాధారాం రాజలింగం, నల్గొండ జిల్లా ఇంఛార్జ్ సతీష్ రెడ్డి, పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.రామారావు, తెలంగాణ వీర మహిళ విభాగం ఛైర్మన్ శ్రీమతి కావ్య, పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ వంగ లక్ష్మణ గౌడ్ తో పాటు పలువురు నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • janasena activists
  • Pawan Kalyan
  • telangana

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • bjp Mp Godam Nagesh

    తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

Latest News

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

  • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

  • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

  • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

  • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd