Pawan Kalyan: మునుగోడులో జనసేన పోటీచేస్తే!
- By Balu J Published Date - 03:25 PM, Mon - 22 August 22
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలన్నీ మునుగోడువైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటు బలం ఉన్న సీపీఐ సైతం మరోసారి చర్చనీయాంశమవుతోంది. తమ మద్దతు అధికార పార్టీ టీఆర్ఎస్ కే అని ప్రకటించింది. అయితే బీఎస్ పీ, వైఎస్సార్ టీపీ, టీడీపీ లాంటి పార్టీలు కూడా మునుగోడులో ప్రభావం చూపాలనుకుంటున్నాయి. అయితే జనసేన పార్టీ కూడా మునుగోడు బరిలో నిలుస్తుందనే వార్తలు వచ్చాయి.
ఈ మేరకు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మునుగోడు ఉప ఎన్నికపై స్పందించారు. మునుగోడులో అభ్యర్థి నిలబెట్టాలని అడుగుతున్నారని, అయితే అక్కడ పోటీ చేస్తే కేవలం వంద, రెండు వందల ఓట్లు మాత్రమే వస్తాయని, ఫలితంగా జనసేనకు ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదని పవన్ స్పష్టం చేశారు. ఇలాంటి ఎన్నికల్లో జనసేన పోటీచేయబోదు అని, తెలంగాణ జనసైనికులకు స్పష్టం చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు.