T Congress : టీ కాంగ్రెస్ లో పదవుల పంచాయితీ..?
T Congress : ఇకపై ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు
- Author : Sudheer
Date : 16-04-2025 - 2:36 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ(Telangana)లో పదేళ్ల నిరీక్షణ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress) పార్టీకి అంతర్గత విభేదాలు మళ్లీ చీలికల రూపం దాలుస్తున్నాయి. తాజాగా మంత్రి పదవుల (Minister Posts) విషయంలో కీలక నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మల్ రెడ్డి, ప్రేమ్ సాగర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Mala Reddy, Prem Sagar, Komatireddy Rajagopal Reddy) వంటి నేతలు తమకు మంత్రి పదవి రావాలని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు ఇప్పటికే మీడియా ముందే తమ అభిప్రాయాలను బయటపెట్టి, పార్టీ సీనియర్ నేతలపై సైతం విమర్శలు గుప్పించడం గమనార్హం. మల్ రెడ్డి తన జిల్లా నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే నని మంత్రి పదవి తనకే కావాలంటున్నాడు. అలాగే ప్రేమ్ సాగర్ సైతం పదవి తనకే దక్కాలని హెచ్చరిస్తున్నాడు.
Dogs Crematorium : ఇక కుక్కలు, పిల్లులకూ శ్మశానవాటిక.. సర్వీసుల వివరాలివీ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎదిగే దశలో ఉన్నప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి మింగుడుపడని విధంగా ఉన్నాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరూ బహిరంగంగా పదవుల గురించి మాట్లాడకూడదని, వాటిపై తుది నిర్ణయం పార్టీ అధిష్ఠానం తీసుకుంటుందన్నారు. ఇలా స్పందించడం ద్వారా పార్టీ పరువు పోతుందని, విపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు ఈ తీరుతో పార్టీకి మాత్రమే కాకుండా, ప్రభుత్వ ప్రతిష్టకూ దెబ్బ తగులుతుందని ఆయా నేతలను హెచ్చరించారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో పదవుల గురించి మాట్లాడే బదులు పార్టీ శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు.
Hero Vida V2: ఇదే మంచి అవకాశం.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 15 వేలు తగ్గింపు..!
ఇకపై ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని, ప్రభుత్వ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ శక్తిని బలోపేతం చేయాలంటే ఒకే గొంతుతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మరి ఈ సూచనలు పాటిస్తూ ఆశావహ నేతలు మౌనంగా ఉంటారా లేక మరోసారి అంతర్గత విభేదాలను బయటపెట్టి పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడతారో చూడాలి.