Congress vs CPM: కాంగ్రెస్ లో పాలేరు పంచాయితీ
తెలంగాణాలో పాలేరు నియోజకవర్గం కోసం పోటీ నెలకొంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఎం పార్టీల మధ్య పోరు నడుస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని గత కొంత కాలంగా చెప్తూ వస్తున్నది
- By Praveen Aluthuru Published Date - 05:17 PM, Sun - 22 October 23

Congress vs CPM: తెలంగాణాలో పాలేరు నియోజకవర్గం కోసం పోటీ నెలకొంది. ఈ సీటు కోసం కాంగ్రెస్, సిపిఎం పార్టీల మధ్య పోరు నడుస్తుంది. మరోవైపు వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తానని గత కొంత కాలంగా చెప్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో పాలేరు అంశం కాంగ్రెస్ హైకమాండ్ కి పెద్ద తలనొప్పిగా మారింది.
పాలేరు స్థానానికి కాంగ్రెస్, సీపీఎం మధ్య పోటీ నెలకొంది. పాలేరు సీటుకి కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్నారు. పాలేరు సీటు తమకు కావాలని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తుండగా.. పాలేరు స్థానంలో వైరా సీటు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ క్రమంలో పాలేరు సీటు కోసం సీపీఎం మరింతగా పోరాడనుంది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఢిల్లీకి ఆహ్వానించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
పొంగులేటి, తుమ్మల ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులు. దీంతో పొంగులేటికి పాలేరు, తుమ్మకు ఖమ్మం ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో పాలేరు స్థానం సీపీఎంకు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ స్థానానికి సీపీఎం తరపున ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభ్యర్థిగా ఉంటారని భావిస్తున్నారు.
Also Read: Kaleshwaram Project : కాళేశ్వరం అవినీతిలో మొదటి దోషి కేసీఆర్ కుటుంబమే – రేవంత్