CM KCR: పాలమూరు ఎత్తిపోతల పథకంను ప్రారంభించిన కేసీఆర్
పాలమూరు ఎత్తిపోతల పథకంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ రోజు శనివారం నాగర్‌కర్నూల్‌లో ప్రారంభించారు
- Author : Praveen Aluthuru
Date : 16-09-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
CM KCR: పాలమూరు ఎత్తిపోతల పథకంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ రోజు శనివారం నాగర్‌కర్నూల్‌లో ప్రారంభించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతోపాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని 1,226 గ్రామాలకు తాగునీరు అందించనున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ భారీ కాన్వాయ్‌లో నాగర్‌కర్నూల్‌కు తరలివెళ్లగా, దారి పొడవునా ఆయనకు అభిమానులు స్వాగతం పలికారు. ఆయనకు పూలమాలలు, హారతులతో ఘన స్వాగతం పలికారు. శనివారం తెల్లవారుజామున నార్లాపూర్ పంప్‌హౌస్‌లోని పంపు వెట్ రన్ ట్రయల్‌ని విజయవంతంగా నిర్వహించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ ఆధారంగా కోతిగుండు నుంచి నీటిని తీసుకోవడమే ఈ పథకం లక్ష్యం. అరవై రోజుల్లో 90 టీఎంసీల నీటిని తరలించేందుకు వీలుగా ఐదు లిఫ్టులు, ఆరు రిజర్వాయర్లను నిర్మించారు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైలాన్ ను ఆవిష్కరించి, బటన్ నొక్కి ఎత్తిపోతలను లాంఛనంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా విడుదల చేసిన కృష్ణా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించారు.#PalamuruRangareddyProject pic.twitter.com/OB7RnD8zGq
— Telangana CMO (@TelanganaCMO) September 16, 2023
Also Read: Telangana liberation day : సెప్టెంబర్ 17 చరిత్ర, రాజకీయ పార్టీల వైఖరి!