Asaduddin Owaisi : బీజేపీ ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ జరుపుకోవడంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీ 'హైదరాబాద్ విమోచన దినోత్సవం' జరుపుకోవడంపై ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Author : hashtagu
Date : 17-09-2022 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’ జరుపుకోవడంపై ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ముక్తి’ అనే పదం తప్పు అన్నారు ఓవైసి. హైదరాబాద్ ఎప్పటికీ భారతదేశంలో భాగమే అన్నారు. దీన్ని ఏక్తా దివస్ గా జరుపుకోవాలని సూచించారు. ఏఐఎంఐఎం తరపున హోంమంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎంకు లేఖ రాసినట్లు చెప్పారు.
ఈ లేఖలో ‘ముక్తి’ కంటే ‘జాతీయ ఐక్యత దినోత్సవం’ అనే వాక్యం సముచితంగా ఉండవచ్చు.” అని పేర్కొన్నట్లు ఓవైసి తెలిపారు. హైదరాబాద్ విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 17న ‘హైదరాబాద్ విమోచన దినోత్సవం’గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.