Osmania Doctors Continue Protest : రెండుగా చీలిపోయిన జూడాలు
ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు ప్రకటించడం కొస మెరుపు
- Author : Sudheer
Date : 26-06-2024 - 12:57 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో రెండు రోజులుగా జూ. డాక్టర్స్ సమ్మె బాట చేపట్టిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్స్ ను ప్రభుత్వం పరిష్కరించాలంటూ విధులు బహిష్క్రించి రోడ్ల ఫై ఆందోళలకు దిగారు. నిన్న రాత్రి ప్రభుత్వం వారితో జరిపిన చర్చలు సఫలం కావడం తో సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చల అనంతరం సమ్మెను తాత్కాలికంగా గాంధీ జూడాలు విరమించగా.. తమ సమ్మె మాత్రం కొనసాగుతుందని ఉస్మానియా జూడాలు ప్రకటించడం కొస మెరుపు.
We’re now on WhatsApp. Click to Join.
జూడాల సమస్యలపై మంగళవారం అర్ధరాత్రి దాకా డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. హాస్టల్ ఫెసిలిటీ, కాకతీయ రోడ్ల నిర్మాణం చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఈ రోజే రెండు జీవోలను విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో గాంధీ జూడాలు సమ్మెను విరమించారు. జీవోలు విడుదల కాకపోతే రేపట్నుంచి మళ్లీ సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు. కాగా, ఉస్మానియా నూతన బిల్డింగ్ విషయంలో క్లారిటీ రానిదే తమ సమ్మెను విరమించబోమని ఉస్మానియా జూడాలు స్పష్టం చేశారు.
Read Also : Kenya violence: కెన్యాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచన..!