Congress Govt : కాంగ్రెస్ పాలనకు ఏడాది.. విజయోత్సవాలపై సీఎం సమీక్ష
Congress Victory Celebrations : ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని తెలిపారు
- By Sudheer Published Date - 11:10 PM, Thu - 14 November 24

డిసెంబర్ నెలతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏడాది పూర్తి (1 year complete) చేసుకోనున్న నేపథ్యంలో విజయోత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష (CM Revanth Review Meeting) నిర్వహించారు. ప్రభుత్వ విజయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన నేతలకు సూచించారు. ముఖ్యంగా మహిళా సాధికారత, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించాలని తెలిపారు. అలాగే విజయోత్సవాల్లో భాగంగా వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ సభల్లో సీఎం పాల్గొనబోతున్నారు.
నవంబర్ 19న వరంగల్ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, సెక్రెటేరియట్, నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవాలు జరపాలని నిర్ణయించారు. అంతే కాకుండా నియోజకవర్గాల వారీగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. డిసెంబర్ 9న సెక్రెటరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం మొదటి ఏడాదిలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలను శాఖలవారీగా ప్రజలకు వివరించాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ విజయోత్సవాలు రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వ విశ్వాసాన్ని పెంచడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.
Read Also : Matka Review & Rating : మట్కా రివ్యూ & రేటింగ్