Nursing Student Suicide : యువతి మృతికేసులో వీడిన మిస్టరీ
Nursing Student Suicide : యువతి మృతికేసులో వీడిన మిస్టరీ
- By Sudheer Published Date - 01:15 PM, Thu - 19 September 24

Nursing Student Suicide Mystery : రెండు రోజుల క్రితం హైదరాబాద్ (Hyderabad) , గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ( Gachibowli Redstone Hotel) నర్సింగ్ విద్యార్థి శృతి (Sruthi) అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్ కు ఉరేసుకుని (Nursing Student Suicide) చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసి హత్యకు (Rep and Murder) పాల్పడ్డారని మృతురాలి కుటుంబసభ్యులు పిర్యాదు చేసారు. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమెది ఆత్మహత్యే అని తేల్చేసారు.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన నర్సింగ్ విద్యార్థిని శృతి..జీవన్ ను ప్రేమిస్తుంది..రెండు రోజుల క్రితం జడ్చర్ల నుండి శృతి హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలకు చూసేందుకు గాను తన స్నేహితులు మోనా, జీవన్ మరో అబ్బాయితో కలిసి వచ్చింది. రెడ్‌స్టోన్ హోటల్‌లో నలుగురూ రెండు గదులు తీసుకున్నారు. నలుగుర కలిసి బీర్లు తాగారు. బీర్ మత్తులో ఉన్న టైంలో జీవన్, శృతి మధ్య పెళ్లి వ్యవహారం చర్చకొచ్చింది. జీవన్ పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. ఆ తర్వాత జీవన్ పక్కనే ఉన్న తన ఫ్రెండ్ గదికి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్లు కూడా బయటకు వెళ్లడంతో గదిలో ఒంటరిగా ఉన్న శృతి క్షణికావేశంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన వారు సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు హోటల్‌కు తిరిగి వచ్చారు. అయితే శృతి ఎంతకీ డోర్ తీయకపోవడంతో హోటల్ సిబ్బందికి చెప్పి మాస్టర్ కీతో ఓపెన్ చేసి లోపలికెళ్లగా.. అప్పటికే శృతి మృతదేహం ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.” అని పోలీసులు తెలిపారు. కేవలం ఆత్మహత్యే తప్ప హత్యాచారం కాదని పోలికియూ తేల్చి చెప్పారు.
Read Also : Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్ 8200’.. ఏమిటిది ?