HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Notices To Brs Mlas

Notices to BRS MLAs : పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు

Notices to BRS MLAs : బీఆర్ఎస్ పార్టీ పిటిషన్‌ ఆధారంగా శాసనసభ కార్యదర్శి వారికి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు కేసులపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు

  • Author : Sudheer Date : 04-02-2025 - 12:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Notice To Brs Mlas
Notice To Brs Mlas

బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వేడెక్కుతోంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ పిటిషన్‌ ఆధారంగా శాసనసభ కార్యదర్శి వారికి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు కేసులపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరారు. దీనికి వారు మరికొంత సమయం కావాలని ఆయా ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ తరుపున విజయం సాధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసి, వారిపై అనర్హత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారికంగా నోటీసులు జారీ చేశారు. దీనిపై విచారణ జరుగుతున్న సమయంలో అసెంబ్లీ కార్యదర్శి తీరు పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులను త్వరగా పరిష్కరించాలని, ఆలస్యం చేయడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేల నుంచి వివరణ కోరుతూ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది.

Tirupati Stampede : తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముగిసిన తొలిదశ జ్యుడీషియ‌ల్ ఎంక్వైరీ..

మరోవైపు బీఆర్ఎస్ నాయకత్వం తమ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ వర్గాలు మాత్రం తమ బలం పెరిగిన నేపథ్యంలో ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో శాసనసభ కార్యదర్శి తీసుకునే నిర్ణయం, తదనుగుణంగా కోర్టులో జరిగే పరిణామాలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS MLAs
  • congress
  • Legislative Assembly Secretary
  • notice
  • Notices to BRS MLAs

Related News

    Latest News

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

    • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

    • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

    • Rupee vs Dollar: స్వల్పంగా బలపడిన రూపాయి

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd