Bandi Sanjay: బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు: బండి సంజయ్
బీజేపీలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవు అని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
- Author : Balu J
Date : 26-05-2023 - 5:57 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో అధికారంలోకి రావాలని కలలుగన్న బీజేపీకి కర్ణాటక రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. దీంతో బీజేపీలో చేరికల ప్రక్రియకు ఫుల్ స్టాప్ పడినట్టు ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు బీజేపీ అంతర్గత విబేధాలున్నాయనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మీడియా ముందుకొచ్చారు.
బీజేపీలో (BJP)లో అంతర్గతంగా ఎలాంటి విభేదాలు లేవని, అది కేవలం కొన్ని మీడియా సంస్థల సృష్టేనని బండి స్పష్టం చేశారు. కరీంనగర్‌లోని పలు వార్డుల్లో ఎంపీలాడ్స్‌తో చేపట్టనున్న పనులకు ఆయన భూమి పూజ చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌తో తనకు రహస్య ఒప్పందం ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి ఎలాంటి ముడుపులు అందలేదని, ఆరోపణలు చేస్తున్న వారు ఆధారాలు చూపాలని సంజయ్ డిమాండ్ చేశారు. కాగా కర్ణాటకలో అధికారం కోల్పోయిన బీజేపీ తెలంగాణలో గెలుపు రుచి చూడాలని మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
Also Read: Nature Man: అతడు అడవిని జయించాడు.. ఉద్యోగం వదిలి, ప్రకృతితో మమేకమై!