MLC Kavitha : బిఆర్ఎస్ భవన్ కు దూరంగా కవిత..?
MLC Kavitha : బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత తరఫున ఎవరూ మద్దతుగా నిలవకపోవడం, తెలంగాణ భవన్ లో ఆమెకి అప్రకటిత ఆంక్షలు విధించారా? అనే ప్రశ్నను ఉదృతం చేస్తోంది
- By Sudheer Published Date - 05:10 PM, Mon - 14 July 25

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర అంశం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పార్టీ (BRS) కీలక నేతలలో ఒకరైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) పార్టీ కార్యాలయం అయిన తెలంగాణ భవన్‌లోకి అడుగుపెట్టడం లేదు అనే ప్రచారం ఊపందుకుంది. గత కొద్దీ రోజులుగా కవిత వ్యవహారం ఎవ్వరికి అర్ధం కావడం లేదు..ఆమె బిఆర్ఎస్ లో ఉందా..? లేక సొంతగా ఓ పార్టీ పెట్టాలనే ఉద్దేశ్యం తో ఉందా అని అంత మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. కేసీఆర్ కు లేఖ రాయడం , కేటీఆర్ పై పరోక్ష విమర్శలు చేయడం వంటివి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఇటీవల ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, రాజకీయ ప్రత్యర్థులపై తీసుకున్న చర్యల అనంతరం ఆమె తెలంగాణ భవన్ కు దూరంగా ఉండడంపై పార్టీ వర్గాల్లోని చర్చలే కాక, ప్రజల మద్యలోనూ సందేహాలు మొదలయ్యాయి. కొద్దీ రోజులుగా ఆమె సమావేశాలన్ని వేరు వేరు ప్రదేశాల్లో పెడుతున్నారు తప్ప తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడం లేదు..అంతే ఎందుకు తెలంగాణ భవన్ సైడ్ కూడా చూడడం మానేసినట్లు అంత చెపుతున్నారు.
Central Government : కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేస్తున్న మోడీ
తాజాగా కవిత అనుచరులు తీన్మార్ మల్లన్న నిర్వహించే క్యూ టీవీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై కవిత తొందరగా స్పందించి, మల్లన్నపై మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయడం, డీజీపీ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగాయి. మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పటికీ, ఆమె ఈ ప్రకటన తెలంగాణ భవన్ లో కాకుండా వేరే వేదికపై ఇచ్చారు. ఇది కేవలం ఒకసారి కాదు.. ఇటీవల కాలంలో ఏ అంశమైనా గానీ ఆమె తెలంగాణ భవన్‌లో కాకుండా వేరే వేదికలకే పరిమితమవుతూ ఉండటం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కవిత తరఫున ఎవరూ మద్దతుగా నిలవకపోవడం, తెలంగాణ భవన్ లో ఆమెకి అప్రకటిత ఆంక్షలు విధించారా? అనే ప్రశ్నను ఉదృతం చేస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి ఆమెకు పూర్తి మద్దతు లేకపోవడం లేదా ఆమె వ్యాఖ్యలు అంగీకారానికి నోచుకోలేదా? అనే అనుమానాలు మిగులుతున్నాయి. మొత్తంగా చూస్తే.. బీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోందా? కవిత పార్టీకి దూరమవుతున్నారా? అనే చర్చలకు ఈ పరిణామాలు మరింత ఊతమిస్తున్నాయి. మరి వీటిల్లో ఎంత నిజం ఉందనేది కవితనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Tragedy : కన్న కొడుకు కళ్లముందే భర్తను నరికి చంపిన భార్య.. బీహార్‌లో దారుణం