ఓటర్లు అమ్ముడుపోతున్నంత కాలం.. రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రావు!
కె. నారాయణ... తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియనివారుండరు. పొలిటికల్ ఇస్యూ ఏదైనా సరే తనదైన స్టయిల్ అవాక్కులు, చమ్మక్కులు పేలుస్తుంటారు. కేసీఆర్ నుంచి మోడీదాకా.. జగన్ నుంచి అమిత్ షా దాకా.. నేతలు ఎవరైనా సరే పట్టించుకోకుండా ఏకీపారేస్తుంటారు.
- By Balu J Published Date - 12:40 PM, Wed - 27 October 21

కె. నారాయణ… తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరు తెలియనివారుండరు. పొలిటికల్ ఇష్యూ ఏదైనా సరే తనదైన స్టయిల్ లో అవాక్కులు, చమ్మక్కులు పేలుస్తుంటారు. కేసీఆర్ నుంచి మోడీదాకా.. జగన్ నుంచి అమిత్ షా దాకా.. నేతలు ఎవరైనా సరే పట్టించుకోకుండా ఏకిపారేస్తుంటారు. ఇతర పార్టీలు నాయకులు తప్పులు చేస్తే.. నిర్భయంగా, నిక్కచ్చిగా ప్రశ్నిస్తుంటారు. హుజురాబాద్ లో ఎవరు గెలుస్తారు? ఏపీలో టీడీపీ కార్యాలయాలపై ఎందుకు దాడులు జరిగాయి? ప్రభుత్వాలు డ్రగ్స్ మాఫియాను ఎందుకు నిలువరించలేకపోతున్నాయి? లాంటి సంచలన విషయాలను షేర్ చేసుకున్నారు. నిత్యం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఇంటర్వ్యూ ‘హ్యాష్ ట్యాగ్’ వ్యూయర్ కోసం..
హుజూరాబాద్ ఎన్నికల్లో సీఎంఐ, సీపీఐ మద్దతు ఎవరికి?
బట్టలు విప్పేసి తిరుగుతున్న సిగ్గులేని రాజకీయాలను చూసి మేం పోటీ చేయడం లేదు. గతంలో నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు మద్దతు విప్పి తప్పు చేశాం. మళ్లీ అలాంటి తప్పు చేయాలనుకోవడం లేదు. డబ్బుతో కూడుకున్న రాజకీయాలకు మా సిద్ధాంతాలు సరికావు. అమ్ముడుపోతున్న ఓటర్లు ఉన్నంతకాలం రాజకీయాల్లో ఎలాంటి మార్పు రాదు. అలాంటివాళ్లకు మద్దతు ఇచ్చి, ఇంకో తప్పు మళ్లీ చేయాలనుకోవడం లేదు.
ఈటల గెలిచాక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా?
రాజకీయాలు ఎలా ఎప్పుడు మారుతాయో చెప్పడం కష్టం. రేవంత్ రెడ్డి డైరెక్ట్ గా ఒప్పుకున్నారు ఈటల కలిశారని.. ఇద్దరూ రాజకీయ నాయకలు కలిసినంత మాత్రాన పార్టీ మారుతారని నేను అనుకోవడం లేదు. అయితే హుజురాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించడానికి బీజేపీ, కాంగ్రెస్ ఏకమవుతున్న మాట మాత్రం వాస్తవం. శత్రువులు కూడా మిత్రులు అవుతారనడానికి హుజురాబాద్ ఉప ఎన్నిక నిదర్శనం.
మీ అంచనాల ప్రకారం హుజూరాబాద్ లో ఎవరు గెలుస్తారు?
ఈటల రాజేందర్ గెలిచే అవకాశాలున్నాయి. 18 ఏండ్లుగా హుజురాబాద్ ప్రజలకు ఆయన సేవలందించారు. మంచి పనిమంతుడు కూడా. ప్రజల అభిమానం ఈటలకు ఉంది. డబ్బుల వల్ల టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అనుకోవడం అపోహ. ఓటర్లందరూ వివేకవంతులయ్యారు. టీఆర్ఎస్ డబ్బులు పంచుతుంది. ఓటర్లను భయపెడుతుంది. అదిమాత్రం వాస్తవం. ఈటల కూడా డబ్బులు పంచుతున్నారు. డబ్బుతో రాజకీయాలు చేయడమేంటి? కాంగ్రెస్ కూడా తన ప్రయత్నం తాను చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ డ్రగాంధ్రప్రదేశ్‌గా మారుతోంది. ఇది ఎంతవరకు నిజం?
నిజమే. బీజేపీ, వైసీపీ పార్టీలు రెండూ ఒక్కటే. అదానీ పోర్ట్ ద్వారా విజయవాడకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు. జగన్ కు ఢిల్లీలో అమిత్ షా అండదండలు ఉన్నాయి కాబట్టే చెలరేగిపోతున్నారు. విజయవాడలో డ్రగ్స్ పట్టుబడినా.. దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఏపీ ప్రజలకు చెప్పాలి. ఏపీలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రోజురోజుకూ పెరిగిపోతోంది, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటేనే అంతం చేయగలవు. కానీ మోడీ, కేసీఆర్ లకు దిక్కు అదానీనే కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
మావోయిస్టు అగ్రనేత ఆర్ కే విషప్రయోగం వల్ల చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారరు?
ఇది పూర్తిగా అవాస్తవం. ఆరే కే కు 40 మంది సెక్యూరిటీగా ఉంటారు. ఆయన ఎక్కువ శాతం అడవుల్లో ఉంటారు కాబట్టి ఆ మాట్లలో నిజం లేదు. నక్సలైట్స్ అణచివేయడానికి విపప్రయోగం అనే మాటను తీసుకొచ్చారు. మిగతావాళ్లను భయంపెట్టడానికి కుట్రలు పన్నారు.. అంతేకానీ ఎలాంటి విష ప్రయోగం జరగలేదు. అతను ఎక్కడా కూడా ట్రీట్ మెంట్ తీసుకోలేదు. ఎవరిని కలవడు. అలాంటప్పుడు అతనిపై విష ప్రయోగం ఎలా జరుగుతుంది? కేవలం వదంతులే.
టీడీపీ కార్యాలయాలపై దాడులను ఏవిధంగా చూడొచ్చు?
నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. రాజకీయాల్లో విమర్శలు సహజం. అంతా మాత్రాన ఇళ్లలోకి వచ్చి దాడులు చేయడం కరెక్ట్ కాదు. ప్రతి నాయకుడికి ఓ కుటుంబం, సంసారం ఉంటుంది. అలా దాడులు చేస్తూ పోతే.. భవిష్యత్తులో లీడర్లు అనేవాళ్లు ఉండరు. ఇకనుంచైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ప్రతి మానుకోవాలి. ఏపీలో గూండా రాజకీయాలు ఎక్కువవుతున్నాయి. ఒకప్పుడు ఎలాంటివి మాత్రం మచ్చుకైనా కనిపించేవీ కావు.
పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఎలా ఉంది?
పవన్ కళ్యాణ్ జస్ట్ ఎంటటైన్ మెంట్ లాంటివాడు. సినిమాలో బ్రేక్స్ వచ్చినట్టుగా అలా ఇచ్చి ఇలా వెళ్తుంటాడు. స్థిరత్వం లేని మనిషి. అతని వల్ల రాజకీయాల్లో మార్పు ఉండదు. పవన్ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. తనకు తిక్క ఉందనేది వాస్తవం. కేవలం పార్టీ ఉందని నిరూపించుకోవడమే కోసమే అప్పుడప్పుడు వార్నింగ్ లు ఇస్తుంటాడు. తన గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్.
::: ఇంటర్వ్యూ రాజు రాథోడ్
Related News

AP Vs Telangana : ఏపీ వర్సెస్ తెలంగాణ.. సాగర్ జలాల పంచాయితీపై 6న కీలక భేటీ
AP Vs Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జునసాగర్ జలాల వివాదంపై కేంద్ర జల శక్తిశాఖ ఆధ్వర్యంలో శనివారం (డిసెంబరు 2న) వీడియో కాన్ఫరెన్స్ జరిగింది.