HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >New Rtc Bus Stands In Hyderabad

New RTC Bus Stands : హైదరాబాద్‌లో కొత్త RTC బస్టాండ్లు..ఎక్కడెక్కడ అంటే..!!

New RTC Bus Stands : తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకరావడం తో ఎక్కడ చూడు బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది

  • Author : Sudheer Date : 04-02-2025 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Rtc Bus Stands Hyd
New Rtc Bus Stands Hyd

హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరికొన్ని ఆర్టీసీ బస్టాండ్ (New RTC Bus Stands) లను నిర్మించేందుకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) కసరత్తులు చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకరావడం తో ఎక్కడ చూడు బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. గతంలో రోజుకు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణిస్తే, ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగడంతో, ఆర్టీసీ అదనపు బస్సులను ప్రవేశపెట్టింది. అయితే, ఈ అధిక రద్దీ కారణంగా ఎంజీబీఎస్ బస్టాండ్‌పై భారీ ఒత్తిడి పెరుగుతోంది.

Viral News : కలికాలం బ్రదర్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కోసం రోడ్డుపై కొట్టుకున్న యువతులు

ప్రస్తుతం ఎంజీబీఎస్ (MGBS) నుంచి తెలంగాణ, ఏపీకి చెందిన పలు ప్రాంతాలకు రోజూ 4,000 బస్సులు, 1.2 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీకెండ్స్‌లో ఈ సంఖ్య 1.5 లక్షల మందికి, పండగల సమయంలో 1.8 లక్షలకు పెరుగుతోంది. శివారు ప్రాంతాల్లో ఉండే ప్రయాణికులు కూడా ఎంజీబీఎస్‌కు రావాల్సిన పరిస్థితి ఉండటంతో, ఆర్టీసీ అధికారులు నగరంలో కొత్త బస్టాండ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రణాళికలో భాగంగా ఆరాంఘర్ చౌరస్తా వద్ద ఒక ఆధునిక బస్టాండ్ నిర్మించనున్నారు. ఈ ప్రాంతం నుంచి మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరు వెళ్లే బస్సులు ఎక్కువగా నడుస్తాయి. అలాగే ఉప్పల్ ప్రాంతం నుంచి వరంగల్, నల్గొండ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సౌలభ్యం కోసం మరో బస్టాండ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. నల్గొండ, ఏపీ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకల సౌలభ్యం కోసం ఎల్బీనగర్ వద్ద మూడో బస్టాండ్ నిర్మించనున్నారు.

World Cancer Day : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం చరిత్ర తెలుసా..?

ఈ కొత్త బస్టాండ్ల నిర్మాణంతో జిల్లాల నుంచి వచ్చే బస్సులు నేరుగా శివారు ప్రాంతాల్లోని బస్టాండ్ల నుంచే రాకపోకలు సాగించేలా మారుతుంది. దీంతో నగర ట్రాఫిక్‌కు తక్కువ భారమవ్వడంతో పాటు, ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో ఎంజీబీఎస్ బస్టాండ్‌పై ఉండే ఒత్తిడిని తగ్గించడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు ఆరాంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లో బస్టాండ్ నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aramghar x road
  • dilsukhnagar
  • hyderabad
  • New RTC Bus Stands
  • Uppal

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

  • Sister of Women's Commission Chairperson Gadwal Vijayalakshmi goes missing.

    Gadwal Vijaya Laxmi: మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి అదృశ్యం

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd