Naveen Yadav : బీజేపీలోకి నవీన్ యాదవ్.. క్లారిటీ ఇదే
కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. అతిథిగా వచ్చిన అందరినీ ఏ విధంగా గౌరవిస్తామో అదే తరహాలో ఆయనను గౌరవించామన్నారు
- Author : Sudheer
Date : 14-11-2023 - 1:12 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లిహిల్స్ (Jubilee Hills Constituency) రాజకీయాలు రోజు రోజుకు మరింతగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ఎక్కడ నుండి భారీ ఫాలోయింగ్ ఉన్న నేతలు బరిలోకి దిగుతుండడం తో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. బీఆర్‌ఎస్ (BRS) సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ , కాంగ్రెస్ (COngress) నుంచి భారత మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దిన్, బీజేపీ (BJP) నుంచి దీపక్ రెడ్డి , మజ్లిస్ పార్టీ నుండి మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ పోటీ పడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మజ్లిస్ పార్టీ నుండి జూబ్లీహిల్స్ బరిలో నిల్చువాలని నవీన్ యాదవ్ (Naveen Yadav) అనుకున్నారు కానీ మజ్లిస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం తో ఇండిపెండెంట్‌గా జూబ్లిహిల్స్ నుంచి బరిలోకి దిగుతున్నట్లు నవీన్ యాదవ్ ప్రకటించారు. దీంతో ఇక్కడ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఈయన 2014లో మజ్లిస్ తరుఫున పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు. 2018లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి.. ఓటమి చెందారు. మరోసారి ఆయన తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో నవీన్ ను బీజేపీలోకి చేర్చుకునేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఈ మేరకు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ (Srisailam Yadav) తో కిషన్ రెడ్డి (Kishan Reddy) సమావేశం కావడం తో నవీన్ బిజెపి లో చేరుతారనే వార్తలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో ఈ వార్తలపై నవీన్ క్లారిటీ ఇచ్చారు. కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని తెలిపారు. అతిథిగా వచ్చిన అందరినీ ఏ విధంగా గౌరవిస్తామో అదే తరహాలో ఆయనను గౌరవించామన్నారు. అయితే.. తమను పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం కిషన్ రెడ్డి రాలేదని స్పష్టం చేశారు.
Read Also : YV Subba Reddy : అప్పుడే పోటీ ఫై క్లారిటీ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి