Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖరారు
Jubilee Hills Bypoll : జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు స్థానిక నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరును అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది.
- Author : Sudheer
Date : 09-10-2025 - 8:16 IST
Published By : Hashtagu Telugu Desk
జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో నెలలుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు స్థానిక నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) పేరును అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మొదటి నుంచే ఆయనను ఈ సీటుకు అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తూ రావడం, హైకమాండ్ ఆ సిఫార్సును ఆమోదించడం ద్వారా నిర్ణయం ఖరారైంది. ఉపఎన్నికలో గెలుపు సాధ్యమని, నవీన్ స్థానిక స్థాయిలో మంచి పట్టు కలిగిన వ్యక్తి అని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ నిర్ణయం ఆనందోత్సాహాలను రేపింది.
42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి
జూబ్లిహిల్స్ రాజకీయాల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్థానికంగా ఆయనకు బలమైన పట్టు ఉండటమే కాకుండా, సినీ రంగంతోనూ ఆయనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఆయన కుమారుడు నవీన్ యాదవ్ కూడా తండ్రి రాజకీయ, సామాజిక ప్రాబల్యాన్ని కొనసాగిస్తూ బస్తీలలో, ముస్లిం వర్గాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. గతంలో 2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆయన, 2019లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. తరువాత 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అజహరుద్దీన్‌కు మద్దతు తెలిపారు. స్థానిక స్థాయిలో మాస్ కనెక్ట్ కలిగిన నవీన్‌ను పార్టీ ఇప్పుడు ఉపఎన్నికకు బరిలో దింపింది.
ఈ సీటు కోసం పలు సీనియర్ నేతలు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే అజహరుద్దీన్త తమ ఆశయాలను వ్యక్తం చేసినప్పటికీ, హైకమాండ్ చివరికి స్థానిక బలం, వర్గీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని నవీన్ యాదవ్ వైపు మొగ్గుచూపింది. పార్టీ నేతలు ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ, నవీన్ గెలుపు దిశగా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్లారని వ్యాఖ్యానిస్తున్నారు. రాబోయే ఉపఎన్నికల్లో ఈ నిర్ణయం కాంగ్రెస్‌కు ఎంతవరకు లాభదాయకమవుతుందో చూడాలి కానీ, ప్రస్తుతానికి జూబ్లిహిల్స్ కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.