KTR vs Lokesh: కేటీఆర్ కి లోకేష్ కౌంటర్…హైదరాబాద్ శాంతిభద్రతలపై కోల్డ్ వార్
తెలంగాణలోని శాంతిభద్రత విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్ర నాయకులపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బాబు అరెస్టు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
- Author : Praveen Aluthuru
Date : 26-09-2023 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
KTR vs Lokesh: తెలంగాణలోని శాంతిభద్రత విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్ర నాయకులపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. బాబు అరెస్టు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్ లోను చంద్రబాబు మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. ముఖ్యంగా ఐటీ ప్రాంగణంలో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. కాగా ఈ అంశంపై కేటీఆర్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ సమస్య, తెలంగాణ సమస్య కాదని, తెలంగాణాలో నిరసనలు తెలపడం సరైన పద్దతి కాదన్నారు. కేటీఆర్ కామెంట్స్ పై నారా లోకేష్ కౌంటర్ ఇచ్చాడు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తెలుగోళ్లు ప్రపంచ వ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలిపారని.. హైదరాబాద్‌లో తెలుగు ప్రజలు ఉన్నారని, అందుకే బాబు అరెస్టుని ఖండిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపారని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పారు. ఎక్కడా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా టీడీపీ అభిమానులు ప్రవర్తించలేదని స్పష్టం చేశారు. .. అయినా వాళ్లు ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదని కేటీఆర్‌ను ఉద్దేశించి లోకేష్ అన్న కామెంట్స్ ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి. నిజానికి కేటీఆర్, లోకేష్ పర్సనల్ గా స్నేహితులు అన్న విషయం అందరికి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ యంగ్ లీడర్ల మధ్య కాస్త దూరం పెరిగేటట్టు కనిపిస్తుంది.
Also Read: Jagan Warning :ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరిక..పనితీరు ఆధారంగానే టికెట్లు కేటాయిస్తాం