Mynampally : కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్లు దోచుకున్నారు తప్ప మెదక్ ను అభివృద్ధి చేయాలే – మైనంపల్లి
మెదక్‌ను పట్టించుకుంటే అభివృద్ధి సాధించేదని.. గజ్వేల్, సిరిసిల్లను మించిపోయేదని వివరించారు. తాను వచ్చిన తర్వాత మెదక్ రూపు రేఖలు మారిపోయానని తెలిపారు
- By Sudheer Published Date - 04:43 PM, Sun - 8 October 23

మల్కాజ్ గిరి మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే , ప్రస్తుత కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతు రావు (Mynampally Hanumantha Rao ) మరోసారి బిఆర్ఎస్ ఫై , కేసీఆర్ ఫ్యామిలీ (KCR Family) ఫై నిప్పులు చెరిగారు. ఆదివారం మెదక జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మైనంపల్లి..కల్వకుంట్ల ఫ్యామిలీ కోట్లు దోచుకున్నారు తప్ప మెదక్ (Medak) ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మెదక్‌ను పట్టించుకుంటే అభివృద్ధి సాధించేదని.. గజ్వేల్, సిరిసిల్లను మించిపోయేదని వివరించారు. తాను వచ్చిన తర్వాత మెదక్ రూపు రేఖలు మారిపోయానని తెలిపారు. మెదక్‌కు మెడికల్ కాలేజీ, రామాయంపేటకు రెవెన్యూ డివిజిన్, డిగ్రీ కాలేజీ వచ్చాయని మైనంపల్లి చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా సమయంలో తన కొడుకు మైనంపల్లి రోహిత్ ఎక్కడికి వెళ్లాడని అంటున్నారని.. అదీ హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తున్నానని మైనంపల్లి అన్నారు. అతను మంత్రి లాగా కాకుండా గల్లీ లీడర్ మాదిరిగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. సేవా కార్యక్రమాలు చేసే సత్తా ఉంటే తమతో పోటీ పడాలని సూచించారు.
Read Also : TSRTC Chairman: టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి