HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Muthyalamma Temple Idol Vandalised Etela Fire

Muthyalamma Temple Idol : హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే సహించేది లేదు – ఈటెల

Idol Vandalised : ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

  • Author : Sudheer Date : 14-10-2024 - 2:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etela Rajender Ide
Etela Rajender Ide

సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. రాత్రి వేళల్లో దేవాలయాల్లోకి చొరబడి..విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కుమ్మరిగూడ లోను అలాగే జరిగింది. అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వసం చేసారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు , రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఘటన స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు తలసాని, శ్రీగణేశ్ చేరుకొని పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

తాజాగా బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ (Etela Rajender) సైతం ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు. మరోపక్క కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఈ ఘటన పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. డీజేలపై నిషేధం విధించిన పోలీసులు.. దేవాలయాల పరిరక్షణపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దుర్గమ్మ నవరాత్రుల పూజ సందర్భంగా చాలా రకాల ఘటనలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also : Boeing : బోయింగ్ కీలక నిర్ణయం..17 వేల మంది ఉద్యోగులపై వేటు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • etela rajender
  • Idol vandalised
  • Kurmaguda
  • Muthyalamma Temple
  • telangana

Related News

Accident

Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా, ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరం నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి ఎడమవైపు ఉన్న బారికేడును ఢీకొట్టింది. అనంతరం కారు పల్ట

  • TSAT

    T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Asaduddin Owaisi

    Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd