Mother-Son Suicide: ‘రామాయంపేట ఘటన’లో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్!
కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఆరోపణలపై టీఆర్‌ఎస్ కు చెందిన ఆరుగురు అరెస్టు అయ్యారు.
- Author : Balu J
Date : 20-04-2022 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
కామారెడ్డిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఆరోపణలపై తెలంగాణ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కి చెందిన ఆరుగురు నాయకులను మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. టీఆర్‌ఎస్ నాయకులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏప్రిల్ 16న కామారెడ్డిలోని ఓ లాడ్జిలో గంగం సంతోష్, అతని తల్లి గంగమ్మలు నిప్పంటించుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియా లోనూ వైరల్ అయ్యింది.
ఘటనకు కారణమైన రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పల్లె జితేందర్ గౌడ్, మరో ఐదుగురు టిఆర్ఎస్ నాయకులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగార్జున రెడ్డితో సహా ఏడుగురి పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నాయకుల వల్లే ఆర్థికంగా నష్టపోయామని, ఇందుకు పోలీసులు కూడా సహకరించారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి విచారణ జరిపి కారకులైనవారిని అరెస్ట్ చేశారు.