HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >More New Railway Stops For Express Trains In Ap And Telangana

Train Haltings : ఏపీ, తెలంగాణలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్త స్టాప్‌లు ఇవే..

Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.

  • Author : Pasha Date : 09-03-2024 - 8:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
General Ticket Rule
General Ticket Rule

Train Haltings : తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో నాలుగు రైల్వే స్టేషన్లలో ఆపాలని రైల్వే శాఖ నిర్ణయించింది.  తెలంగాణలోనూ పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 14 స్టేషన్లలో అదనపు స్టాపేజీని రైల్వేశాఖ కల్పించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, గుంటూరు రైల్వే డివిజన్ల పరిధిలో నడిచే రైళ్లకు తెలంగాణలోని 14 స్టేషన్లలో అదనపు స్టాప్‌లను కేటాయించారు. వీటిలో అత్యధికంగా 9 స్టేషన్లు సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోనివే కావడం గమనార్హం. ప్రధానంగా తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (17405/17406) మేడ్చల్‌లో.. నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12787, 12788) ట్రైన్  మహబూబాబాద్‌లో ఇకపై ఆగుతాయి. తనతో పాటూ స్థానికుల రిక్వెస్ట్ మేరకు రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వివరాలతో ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

  • సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (20701/20702) మిర్యాలగూడలో(Train Haltings) ఆగుతుంది.
  • రేపల్లె-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17646) రామన్నపేటలో ఆగుతుంది.
  • గుంటూరు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (17253) ఉందానగర్‌లో ఆగుతుంది.
  • తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ (12763) నెక్కొండలో ఆగుతుంది.
  • పుణె-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (22151/22152) మంచిర్యాలలో ఆగుతుంది.
  • దౌండ్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (11409/11410) నవీపేటలో ఆగుతుంది.
  • కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ (17035/172036) రాఘవాపురంలో ఆగుతుంది.
  • బల్లార్ష-కాజీపేట ఎక్స్‌ప్రెస్‌ (17035/172036) మందమర్రిలో ఆగుతుంది.
  • సికింద్రాబాద్‌-భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17659/17660) తడికలపూడిలో ఆగుతుంది.
  • భద్రాచలం రోడ్‌-సికింద్రాబాద్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ (17660) బేతంపూడి స్టేషన్‌లో ఆగుతుంది.
  • భద్రాచలంరోడ్‌-బల్లార్ష సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్‌ (17033,17034) బేతంపూడిలో ఆగుతుంది.
  • కాజీపేట-బల్లార్ష ఎక్స్‌ప్రెస్‌ (17035) రేచ్ని రోడ్‌లో ఆగుతుంది.

Also Read : Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి

ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌కు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. అంతర్రాష్ట్ర ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ఇది. పొరుగునే ఉన్న ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం మార్గంలో రాకపోకలు సాగించనుంది. భువనేశ్వర్‌లో బయలుదేరే ఈ రైలు.. పూరి, కటక్, బ్రహ్మపూర్ మీదుగా విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 12వ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మరో వందేభారత్ అందుబాటులోకి రావడం శుభ పరిణామమే.

Also Read :Tandoori Egg Recipe: తందూరి కోడిగుడ్డు రెసిపీ.. ఇంట్లోనే సింపుల్గా చేసుకోండిలా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • express trains
  • Railway Stops
  • telangana
  • Train Haltings

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd