MLC Kavitha: తెలంగాణ పండగలను సగర్వంగా చాటిచెబుదాం.. సంస్కృతిని కొనసాగిద్దాం
మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
- By Balu J Published Date - 11:50 AM, Wed - 18 October 23

MLC Kavitha: ఎంతో ప్రత్యేక విశిష్టత కలిగిన తెలంగాణ పండగలను సగర్వంగా చాటి చెబుదామని, మన సంస్కృతిని ఇలానే కొనసాగిద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ పండగలు, కళలు ఎప్పటికీ వర్ధిల్లుతుండాలని అన్నారు. వందల ఏళ్ల నుంచి బతుకమ్మ పండుగతో సంస్కృతిని కాపాడుతున్న ఘనత మహిళలకు దక్కుతుందని స్పష్టం చేశారు. వందల సంవత్సరాల నుంచి బతుకమ్మ పండగను విడవకుండా మన సంస్కృతిని కాపాడుతున్న ఘనత ఆడబిడ్డలకు దక్కుతుందని స్పష్టం చేశారు. మరో వందేళ్లపాటు కూడా బతుకమ్మ పండుగకు డోఖా ఉండకూడదన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమ సమయంలో పాఠశాలలకు వెళ్లి చిన్న పిల్లలకు బతుకమ్మ ఆవశ్యకతను చెప్పేవాళ్లమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరింత ఉత్సాహంతో ఘనంగా బతుకమ్మను నిర్వహించుకుంటున్నామని చెప్పారు.
జగిత్యాల పట్టణంలో వైభవోపేతంగా జరిగిన బతుకమ్మ సంబరాల్లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన సంస్కృతి కచ్చితంగా ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. సంస్కృతి లేని సమాజం అంటే వేర్లు లేని చెట్టు వంటిదని స్పష్టం చేశారు. సంస్కృతిని మరిచిపోయే సమాజం బాగుండదు కాబట్టి పండగలను సగర్వంగా చాటి చెబుతూ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మొట్టమొదటిసారిగా తాను మైక్ ముందు బతుకమ్మ పాట పాడానని, యూట్యూబ్లో అందరూ ఆ పాట విని అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.
రాబోయే తరాల్లో బతుకమ్మ పాట పదిలంగా ఉండేందుకు పిల్లలకు బతుకమ్మ పాటలు నేర్పించాలని కోరారు. సీఎం కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ పల్లెలన్నీ నీళ్లతో, చెరువులతో కళకళలాడుతున్నాయని తెలిపారు. అమ్మవారి దయతోటి తెలంగాణ ఇలానే సుభిక్షంగా ఉండాలని, మంచిగా పంటలు ఉండాలని ఆకాంక్షించారు. బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, భారత జాగృతి కార్యకర్తలను కవిత అభినందించారు.
Also Read: TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, బతుకమ్మ, దసరా సందర్భంగా TSRTC లక్కీ డ్రా షురూ!