Telangana : రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే..కరెంట్ పోతది.. మా బతుకులు చీకటి – MLC కవిత
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని..పొరపాటున వస్తే.. కరెంట్ పోతది.. మా బతుకులు చీకటి అయిపోతదని తెలంగాణ ప్రజలు అంటుకుంటున్నట్లు కవిత చెప్పుకొచ్చారు
- Author : Sudheer
Date : 28-09-2023 - 4:56 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) హావ పెరుగుతుండడం తో అధికార పార్టీ బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) కాంగ్రెస్ ఫై మాటల తూటాలు వదులుతున్నారు. మొన్నటి వరకు బిజెపి (BJP) ని టార్గెట్ చేసిన నేతలంతా..ఇప్పుడు రూటు మార్చారు. రాష్ట్రంలో బిజెపి హావ పూర్తిగా తగ్గడం..ఇదే క్రమంలో కాంగ్రెస్ బలం భారీగా పెరుగుతుండడం..బిఆర్ఎస్ నేతలు సైతం కాంగ్రెస్ పార్టీ లోకి చేరుతుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ఫై నమ్మకం రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో బిఆర్ఎస్..కాంగ్రెస్ పార్టీ ఫై మరింత ఫోకస్ చేసింది. అగ్ర నేతల దగ్గరి నుండి చిన్న చితక నేతల వరకు కాంగ్రెస్ ఫై విమర్శలు చేయడం స్టార్ట్ చేసారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన గ్యారెంటీ హామీల ఫై విమర్శలు , సెటైర్లు వేస్తూ వస్తున్నారు.
తాజాగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కాంగ్రెస్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఏ మాట చెప్పినా.. నమ్మశక్యంగా ఉండదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని..పొరపాటున వస్తే.. కరెంట్ పోతది.. మా బతుకులు చీకటి అయిపోతదని తెలంగాణ ప్రజలు అంటుకుంటున్నట్లు కవిత చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో జరగబోయేది ఒకటే.. ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్నిచోట్ల గులాబీ జెండా ఎగురుతుందని.. ఎగరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని కవిత తెలిపారు.
Read Also : Ganesh Shobha Yatra : పవన్ పాటకు దుమ్ములేపే స్టెప్స్ తో అదరగొట్టిన తెలంగాణ పోలీసులు