Balka suman : సుమన్ ఫై కాదు.. రేవంత్ ఫై కేసు పెట్టాలి: కవిత
- Author : Sudheer
Date : 06-02-2024 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)..సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు.
ఈ కేసు ఫై BRS MLC కవిత స్పందించారు. ‘దళిత బిడ్డ సుమన్పై ప్రభుత్వం FIR నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. నాడు ఉమ్మడి APలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన అందించడం రాచరికాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఫై అసభ్య పదజాలం ప్రయోగించిన సీఎం రేవంత్ ఫై ముందు కేసు నమోదు చేయాలి’ అని కవిత డిమాండ్ చేశారు.
రీసెంట్ గా సీఎం రేవంత్ (CM Revanth Reddy)..కేసీఆర్ (KCR)ఫై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సవాళ్లు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman)..సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) తో రెచ్చిపోయారు. ‘పాగల్ గాడు, హౌ* గాడు. ఈ చెత్త నా కొ*ను చెప్పుతో కొట్టాలి. కానీ సంస్కారం అడ్డు వస్తోంది. బిడ్డా ఖబడ్డార్.. ఇంకోసారి మా KCRను అంటే లక్షమందితో తొక్కుతాం..’ అంటూ రెచ్చిపోయారు. ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతగా చాలా మాట్లాడి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిగా.. పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ హితవు పలికారు. మంచిర్యాలలో పార్టీ జిల్లా సమీక్ష స్థాయి సమావేశంలో సుమన్ ఈ కామెంట్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.
We’re now on WhatsApp. Click to Join.
అయితే, బాల్కసుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు మంచిర్యాల స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 294బీ, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు రిజిష్టర్ చేశారు. ఇక సుమన్ వ్యాఖ్యలకు నిరసనగా మంచిర్యాల కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టి బొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే , దళిత బిడ్డ బాల్క సుమన్ పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుంది.…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 6, 2024
Read Also : Dr. Prathap C Reddy: తన తాతయ్య బయోపిక్ తీస్తానంటున్న ఉపాసన.. హీరోగా చెర్రీ నటించనున్నాడా?