KTR : దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? – కేటీఆర్ కు అద్దంకి కౌంటర్
KTR : ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిజంగా కుంభకోణం జరిగితే, తగిన దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 11-04-2025 - 1:18 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలో హెచ్‌సీయూ భూముల వివాదం (HCU Land Issue) రాజకీయంగా వేడెక్కింది. ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటుగా స్పందించారు. “దొంగలే దొంగతనం గురించి మాట్లాడితే ప్రజలు నమ్ముతారా?” అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ప్రభుత్వాన్ని అపకీర్తిపర్చేందుకు బీఆర్ఎస్ కుట్రలు పన్నుతోందని అద్దంకి ఆరోపించారు.
Glowing Face: రాత్రి పడుకునే ముందు ఈ ఐదు రకాల పనులు చేస్తే చాలు.. మీ ముఖం తలతల మెరిసిపోవాల్సిందే?
కేటీఆర్ చేసిన ఆరోపణలు తుస్సు బాంబులే అంటూ అద్దంకి దయాకర్ (MLC Addanki Dayakar) వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. నిజంగా కుంభకోణం జరిగితే, తగిన దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూకుంభకోణాలు, ఆర్థిక దోపిడీపై కూడా ప్రజలు మరచిపోలేదని గుర్తుచేశారు.
ఇక కేటీఆర్ ఆరోపణలు చూస్తే… హెచ్‌సీయూ వద్ద ఉన్న 400 ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి ప్రభుత్వానికి రూ.10 వేల కోట్ల రుణం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో బ్రోకరేజ్ కంపెనీలు, బీజేపీ ఎంపీకి సంబంధాలు ఉన్నాయని , తాము త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాస్తామని, సీబీఐ, సెబీ, సీబీఐ వంటి సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది పూర్తిగా రాజకీయ నాటకమేనని, ప్రజల్లో భయం కలిగించేందుకు బీఆర్ఎస్ చేస్తున్న యత్నమని నొక్కి చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికి HCU ల్యాండ్స్ వ్యవహారం అనేది రాజకీయ పార్టీల్లో కాకరేపుతుంది.
కేటీఆర్ బాంబు పేలుస్తారు అంటే..తుస్సు బాంబు పేల్చారు..
◼️పులకేసిని మించిపోయిన కేటీఆర్
◼️కేటీఆర్ చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలే
◼️ఎలాంటి ఆధారాలు లేకుండా చెత్త స్టేట్మెంట్లు ఇస్తున్నాడు
◼️కేటీఆర్ ను మెంటల్ డాక్టర్ కి చూపిస్తే మంచిది
డాక్టర్ అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ,తెలంగాణ pic.twitter.com/7GsFG5MqwG— Addanki Dayakar (@ADayakarINC) April 11, 2025