Telangana : కాంగ్రెస్ లోకి మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే..?
అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి
- By Sudheer Published Date - 08:32 PM, Mon - 25 September 23

కాంగ్రెస్ (Congress) పార్టీ లోకి వలసల పర్వం ఆగడం లేదు. మూడు నెలల వరకు కాంగ్రెస్ వైపు పెద్దగా ఎవరు చూడలేదు కానీ ..ఇప్పుడు అంత కాంగ్రెస్ బాటే పడుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) నేతలంతా ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ప్రతి రోజు ఎవరో ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. రెండు రోజుల క్రితం మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతురావు (Mynampally Hanumantha Rao) బిఆర్ఎస్ కు రాజీనామా చేయగా..ఇప్పుడు మరో ఎమ్మెల్యే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ (MLA Rathod Bapurao) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల బరిలో కేసీఆర్ తనకు కాదని నేరడిగొండ జడ్పీటీసీ అనిల్ జాదవ్ కు టికెట్ ఖరారు చేయడంతో.. బాపురావ్ ఆగ్రహం తో ఉన్నారు. అభ్యర్థుల ప్రకటన నుండే ఆయన అనుచరులు కాంగ్రెస్ లోకి చేరాలంటూ ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. కాకపోతే బాపురావ్ ఆలోచిస్తూ వస్తున్నారు. మూడు రోజుల క్రితం మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కావాలని రాథోడ్ బాపురావు కోరడం జరిగింది. దీనికి కేటీఆర్ నుంచి స్పందన రాకపోవడం..
. రోజు రోజుకు అనుచరులు , కార్యకర్తల ఒత్తిడి ఎక్కువతుండడం, మరోపక్క కాంగ్రెస్ సైతం ఆహ్వానం అందిస్తుండడంతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసి..కాంగ్రెస్ లో చేరాలని చూస్తున్నాడు. రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ లో చేరేది అధికారికంగా తెలుస్తుందని ఆయన అనుచరులు చెపుతున్నారు. మొత్తం మీద బిఆర్ఎస్ కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరుతుండడం తో రోజు రోజుకు కాంగ్రెస్ బలం పెరుగుతుంది..అలాగే పార్టీ శ్రేణుల్లో ఉత్సహం పెరుగుతుంది.