Raja Singh : ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం పై ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Raja Singh : కానీ ఆ వ్యక్తి ఎవరి మాటలు విని గుడిపై దాడి చేశాడో పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అతడి పేరు మునావర్ జామా.., అతడు ముంబయిలో ఉంటాడు. రెండో జాకీర్ నాయక్ కావాలని అతడి కల.
- By Latha Suma Published Date - 04:03 PM, Fri - 18 October 24

Mutyalamma Temple : ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఘటన గురించి దాదాపు అందరికీ తెలిసిందే. తాజాగా ఈ విషయం పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడారు. ముత్యాలమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద బషీర్, రెహ్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని స్థానికులు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఆ వ్యక్తి ఎవరి మాటలు విని గుడిపై దాడి చేశాడో పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అతడి పేరు మునావర్ జామా.., అతడు ముంబయిలో ఉంటాడు. రెండో జాకీర్ నాయక్ కావాలని అతడి కల.
కానీ దాదాపు 100 నుంచి 150 మందిని మెట్రోపోలీస్ హోటల్లో పెట్టుకుని హిందు ధర్మం, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. కానీ పోలీసులు అతడి పేరును ఎఫ్ఐఆర్ లో మాత్రమే పెట్టారు. ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రశ్నించారు రాజాసింగ్. 100 నుంచి 150 మందికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి బయటకు పంపించారు తప్పితే ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నారు. బషీర్, రెహ్మాన్.. అనే వ్యక్తులు మునావర్ జామా మాటలు విని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 150 మంది ఏ రాష్ట్రం నుంచి వచ్చారు.. వారు ఇతర ప్రాంతాల్లో వెళ్లి ఏమైనా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. జాకీర్ నాయక్ మాటలు విని చాలా మంది టెర్రరిస్టులుగా మారారు. ఆయన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు..? 150 మందిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఎప్పుడు విచారణ చేస్తారు. పోలీసులు ఈ కేసును ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి, డీజీపీ, కమిషనర్ కు రిక్వెస్ట్ చేస్తున్నా. హిందు దేవాలయాలపై దాడులు చేస్తే నిర్లక్ష్యం వహించకండి అని రాజాసింగ్ సూచించారు.
Read Also: CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్