MLA Matta Ragamayee : సత్తుపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
MLA Matta Ragamayee Dayanand : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో RO ప్లాంట్ ఏర్పాటు, 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం, అలాగే ప్రభుత్వ నిధులతో 56 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు
- By Sudheer Published Date - 10:07 PM, Tue - 3 December 24

సత్తుపల్లి (Sathupalli ) నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ (Matta Ragamayee Dayanand) గారి నాయకత్వంలో అభివృద్ధి పనులు పరవళ్లు తొక్కుతున్నాయి. సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు (Praja Palana Vijayotsavam Celebrations) కార్యక్రమంలో MLA గారు పాల్గొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో RO ప్లాంట్ ఏర్పాటు, 12 లక్షల రూపాయల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణం, అలాగే ప్రభుత్వ నిధులతో 56 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
MLA మట్టా రాగమయి దయానంద్ (Matta Ragamayee Dayanand) గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో గ్రామాభివృద్ధికి విశేషంగా సహకరించిందని తెలిపారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలంటూ గ్రామస్తులను ఆహ్వానించారు. తెలంగాణలో సీఎం రేవంత్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల్లో 5 పథకాలు ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మహిళల సంక్షేమానికి ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుబాటులోకి రావడం మహిళా వర్గంలో సంబరాలు తెచ్చాయని MLA గారు పేర్కొన్నారు. రైతుల కోసం 2 లక్షల రూపాయల రుణమాఫీ, సన్న రకం వరి ధాన్యంకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించడం ద్వారా రైతుల జీవనోపాధిని మెరుగుపర్చినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరలో ప్రారంభం కానుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, మంత్రివర్యులు తుమ్మల గారు, పొంగులేటి గారుల నేతృత్వంలో వేగవంతమవుతున్నాయని వివరించారు. డిసెంబర్ 5న బుగ్గపాడు ఫుడ్ పార్క్‌లో భారీ బహిరంగ సభ జరగనున్నందున ప్రజలంతా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ దోమ ఆనంద్, వివిధ అధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు సత్తుపల్లి నియోజకవర్గాన్ని కొత్త స్థాయిలో నిలపనున్నాయని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.
Read Also : 200 Units of Free Electricity : 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై కూటమి ప్రభుత్వం క్లారిటీ