MLA Danam : హైడ్రాపై దానం గరం గరం..
MLA Danam : తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు
- By Sudheer Published Date - 05:40 PM, Wed - 22 January 25

చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) హైడ్రా (Hydra) అధికారులపై గరం గరం అయ్యాడు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఎక్కడి నుంచో వచ్చిన వారు తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ దానం ఫైర్ అయ్యాడు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని డిమాండ్ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానని హెచ్చరించారు.
BRS Diksha Divas : బిఆర్ఎస్ కు బిగ్ రిలీఫ్
హైడ్రా కూల్చివేతల విషయంలో దానం నాగేందర్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. జూబ్లిహిల్స్ లో ఓ పార్కు ఆక్రమణను తొలగించినప్పుడు ధర్నా చేశారు. అయితే ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగ విమర్శలు వద్దని ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని ఆయనకు కాంగ్రెస్ అగ్రనేతలు స్పష్టం చేశారు. అయితే కొంత కాలం సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి హైడ్రాపై విరుచుకుపడుతున్నారు. తన నియోజకవర్గంలో అసలు హైడ్రా అడుగు పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పుడు నేరుగా అధికారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై గతంలో చాలా సార్లు సీరియస్ విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
𝐊𝐡𝐚𝐢𝐫𝐚𝐭𝐚𝐛𝐚𝐝 𝐌𝐋𝐀 𝐃𝐚𝐧𝐚𝐦 𝐍𝐚𝐠𝐞𝐧𝐝𝐞𝐫 𝐎𝐩𝐩𝐨𝐬𝐞𝐬 𝐃𝐞𝐦𝐨𝐥𝐢𝐭𝐢𝐨𝐧 𝐃𝐫𝐢𝐯𝐞 𝐚𝐭 𝐂𝐡𝐢𝐧𝐭𝐚𝐥 𝐁𝐚𝐬𝐭𝐢
Khairatabad MLA, Danam Nagender, voiced his anger over the demolition of unauthorized structures opposite Shadan College, accusing officials of… pic.twitter.com/Zq65HEDrDM
— Hyderabad Mail (@Hyderabad_Mail) January 22, 2025