MLA Arekapudi Gandhi : రేపు కాంగ్రెస్ లో చేరనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ..?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది మొదలైనట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 10:59 AM, Fri - 12 July 24

బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. మాకు పార్టీ నియమాలు , నిబంధనలు అవసరం లేదు..అధికారమే కావాలని అన్నట్లు వరుసగా సొంత పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..ఈరోజు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే తరుణంలో రేపు మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) (శేర్లింగంపల్లి) సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పోటీ చేసిన బిఆర్ఎస్ కేవలం 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. రెండుసార్లు విజయకేతనం ఎగురవేసిన బిఆర్ఎస్ కు ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. మూడోసారి మార్పు రావాల్సిందే అంటూ ఏకధాటిగా కాంగ్రెస్ పార్టీ ని భారీ మెజార్టీ తో గెలిపించారు. ఇక్కడ కేసీఆర్ పాలన బాగాలేదనో కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు నచ్చకనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వొద్దంటూ ఆయా నియోజకవర్గ ప్రజలు మొత్తుకున్నా కేసీఆర్ మొండిగా మళ్లీ వారికే టికెట్ ఇచ్చి తన ఓటమిని తానే తెచ్చుకున్నాడు. అయితే హైదరాబాద్ , రంగారెడ్డి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ గాలి ఏమాత్రం వీయలేదు. ఇక్కడ కారు జోరు స్పష్టంగా కనిపించింది. అందుకే కారు గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యే ను కాంగ్రెస్ లోకి లాక్కోవడం మొదలుపెట్టారు సీఎం రేవంత్.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరనున్నట్లు గత కొద్దీ రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అది మొదలైనట్లు తెలుస్తుంది. అంత ఒకేసారి చేరితే బాగోదని ఒకరి తర్వాత ఒకరు చేరేందుకు డిసైడ్ అయ్యారు. నేడు ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), రేపు అరికెపూడి గాంధీ (శేర్లింగంపల్లి) హస్తం తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు లక్ష్మారెడ్డి (ఉప్పల్), సుధీర్ రెడ్డి (ఎల్బీ నగర్), మాధవరం కృష్ణారావు (కూకట్ పల్లి), వివేకానంద గౌడ్ (కుత్బుల్లాపూర్) కూడా కండువా మార్చుకోబోతున్నట్లు సమాచారం. ఈనెల 24 తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాలలోపే చేరికలు పూర్తి చేయాలని కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది.
Read Also : Bharateeyudu 2 Public Talk : మెగా ఫ్యాన్స్ లో మొదలైన భయం