HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Miyapur Family Deaths Chandanagar Woman Body

Miyapur Tragedy : అసలేం జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు.

  • Author : Kavya Krishna Date : 21-08-2025 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dead
Dead

Miyapur Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ ప్రాంతంలో ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మక్త మహబూబ్‌పేటలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం మరింత కలచివేసింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతులను లక్ష్మయ్య (60), వెంకటమ్మ (55), అనిల్ (32), కవిత (24), అప్పు (2)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోని పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక దర్యాప్తులో, పసికందును హత్య చేసి మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ఈ ఘటన వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లేదా లేఖ లభించలేదని అధికారులు తెలిపారు. ఈ కుటుంబం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి గ్రామానికి చెందినదని, కొద్ది కాలంగా జీవనోపాధి కోసం హైదరాబాద్‌లో స్థిరపడిందని పోలీసులు వివరించారు.

Telangana : పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు !

ఇదిలా ఉంటే, మియాపూర్ ఘటనతో పాటు చందానగర్‌లో కూడా ఒక మృతదేహం లభ్యమైంది. అక్కడి ఓ నాలాలో మహిళ మృతదేహం కొట్టుకువచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆ మహిళ చేతిపై ‘నర్సమ్మ’ అనే పేరుతో పచ్చబొట్టు ఉంది. దాని ఆధారంగా మృతురాలి గుర్తింపుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మృతదేహం వద్ద లభించిన పర్సు, అందులో ఉన్న కమ్మలు, బ్రాస్ లెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనలతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన మియాపూర్ ఘటన వెనుక కారణాలేంటో పోలీసులు తెలుసుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేశారు. అదే సమయంలో చందానగర్‌లో లభించిన మహిళ మృతదేహం కేసులో కూడా పూర్తి వివరాలను వెలికితీసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Teenmar Mallanna : తెలంగాణ రాజకీయాల్లో బీసీల కొత్త శకం ప్రారంభమా? తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandanagar body found
  • hyderabad crime
  • Miyapur tragedy
  • Suspicious Deaths
  • telangana news

Related News

Shivapratap Shukla Appointed As Telangana New Governor

నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

Telangana New Governor  తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నూతన గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా నేడు భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయన, ఇప్పుడు తెలంగాణలో బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాసేపట్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న శుక్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

Latest News

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

  • అమరావతిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd