HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Ponnam Prabhakar Appeals To Abandon The Idea Of A Strike

TGSRTC : సమ్మె ఆలోచనను విరమించుకోండి..మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించేదిగా ఉంటుందన్నారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

  • Author : Latha Suma Date : 06-05-2025 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponnam Prabhakar appeals to abandon the idea of ​​a strike
Minister Ponnam Prabhakar appeals to abandon the idea of ​​a strike

TGSRTC : ఆర్టీసీ సిబ్బందికి సమ్మె మార్గాన్ని విడిచిపెట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంత్రి పొన్నంను ఐఎన్‌టీయూసీకి చెందిన కార్మిక సంఘాల ప్రతినిధులు కలిసి, సిబ్బంది సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రస్తుతం మెల్లమెల్లగా కోలుకుంటోందని, ఇలాంటి సమయంలో సమ్మె చేయడం ప్రజలకు ఇబ్బందులు కలిగించేదిగా ఉంటుందన్నారు. కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

Read Also: Terrorist Hideout : పంజాబ్‌లో ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భద్రతా బలగాలు

ఈ నేపథ్యంలో, ఆర్టీసీ యాజమాన్యం కూడా ఉద్యోగులకు బహిరంగంగా లేఖ రాసి, సమ్మె ఆలోచనను విరమించాలని విజ్ఞప్తి చేసింది. ఆ సంస్థను తల్లిలాగా భావించి, అందరూ కలిసి కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ‘‘సంస్థ అభివృద్ధి మార్గంలోకి వస్తున్న సమయంలో ఇటువంటి ఉద్యమాలు దిశాహీనంగా మారుతాయి. గతంలో 2019లో జరిగిన సమ్మె వల్ల ఆర్టీసీ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. అటువంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి,’’ అని లేఖలో పేర్కొన్నారు.

ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మిక సంఘాల సూచనల ప్రకారం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యాజమాన్యం తెలిపింది. కొంతమంది వ్యక్తులు ప్రయోజనాల కోసం ఉద్యోగుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అటువంటి మాటలకు లోనవకుండా ఉద్యోగులు తన బాధ్యతలు నిర్వర్తించాలని సూచించింది. అంతేకాదు, ఆర్టీసీలో సమ్మెలు నిర్వహించడం ఎస్మా చట్టం ప్రకారం నిషిద్ధమని స్పష్టం చేసింది. సమ్మె పేరుతో విధులకు ఆటంకం కలిగించినా, ఇతరులను బెదిరించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Read Also: Spirtual: అపార ధన ప్రాప్తి కోసం ఎలాంటి విషయాలను పాటించాలో మీకు తెలుసా?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • appeals
  • INTUC
  • Labor unions
  • RTC Strike
  • strike
  • TGSRTC

Related News

Tgsrtc Bus Chage

TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

మెట్రో డీలక్స్ బస్సుల్లో గతంలో 4 కిలోమీటర్ల ప్రయాణానికి ఉన్న రూ. 30 టికెట్ ధరను రూ. 25కు తగ్గించారు. అలాగే, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో గతంలో ఉన్న రూ. 35 ధరను కూడా రూ. 25కు కుదించడం విశేషం

  • Bus Pass Renewal Telangana

    TGSRTC : ఇకపై బస్ పాస్ రెన్యువల్ కోసం బస్టాండ్ కు వెళ్లనక్కరలేదు !!

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd