HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Nara Lokesh Is Angry With The Behavior Of Some Mlas

Nara Lokesh : కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత టిడిపి–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం

  • Author : Sudheer Date : 10-11-2025 - 5:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Lokesh
Minister Lokesh

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత టిడిపి–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటుతున్న తరుణంలో, అభివృద్ధి–సంక్షేమం రెండింటిలోనూ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. అయితే ఆ విజయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో కొంత వెనుకబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అనుభవ లేమితో పలు పరిపాలనా, రాజకీయ సమస్యల్లో చిక్కుకుంటుండటం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ పరిస్థితులపై సమీక్షించేందుకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నారా లోకేష్ ఈరోజు పలువురు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Jubilee Hills By Election : నవీన్ యాదవ్ భారీ మెజార్టీ తో గెలవబోతున్నారు – ఉత్తమ్

ఈ భేటీలో లోకేష్ మాట్లాడుతూ..“తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారు, ఇతరులతో సమన్వయం సరిగా లేకపోవడం వల్ల అనవసర వివాదాలు వస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇటీవల తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సహా కొందరు కొత్త ఎమ్మెల్యేలు స్థానిక స్థాయిలో అధికార యంత్రాంగం, పార్టీ నేతలతో ఘర్షణ పడిన ఘటనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కొత్త ఎమ్మెల్యేలను గాడిన పెట్టే బాధ్యతను సీనియర్ మంత్రులకు లోకేష్ అప్పగించారు. “మీ అనుభవాలు, మీరు ఎదుర్కొన్న సవాళ్లు వీరితో పంచుకోండి. వీరి లోపాలు సరిదిద్దడంలో మీరు మార్గనిర్దేశనం చేయాలి. లేకపోతే వీరికి మళ్లీ ప్రజాభిమానాన్ని సంపాదించడం కష్టం” అని స్పష్టంగా తెలిపారు.

Telangana Youth : తెలంగాణ యువతకు గొప్ప శుభవార్త

అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యతను లోకేష్ మరోసారి ప్రస్తావించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న “పార్టనర్షిప్ సమ్మిట్” విజయవంతం కావడం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని ఆయన పేర్కొన్నారు. “వివాదాలకు దూరంగా ఉండండి, రాష్ట్ర అభివృద్ధే ప్రథమ ప్రాధాన్యం. ఈ సదస్సు విజయవంతమైతే దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు, భారీ స్థాయిలో ఉద్యోగాలు వస్తాయి” అని చెప్పారు. అలాగే ప్రతి మంత్రి, ఇన్‌చార్జ్ మంత్రి తమ జిల్లాలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు సౌకర్యాలు కల్పించే దిశగా చురుకుగా వ్యవహరించాలని లోకేష్ ఆదేశించారు. అభివృద్ధి–సంక్షేమం–శాసనపరమైన స్థిరత్వం ఈ మూడు స్తంభాలపై ప్రభుత్వం నిలవాలని ఆయన స్పష్టంగా తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Lokesh Meeting
  • nara lokesh
  • nara lokesh fire
  • New MLAS

Related News

Good News For Unemployed

IT Park : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ..విశాఖ లో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

విశాఖతో పాటు రాజధాని అమరావతిలో కూడా విద్యా మరియు ఉపాధి రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సుమారు రూ. 300 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ 'జేవియర్' (Xavier) క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నారు

  • Minister Lokesh

    విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • Kutami Govt

    అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

  • gas cylinder

    Gas Shortage : గ్యాస్ ధరల పెంపు పై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

Latest News

  • ప్రధాని మోదీకి ఎఫ్‌ఎస్‌యుఐ అత్యవసర లేఖ.. భార‌త్ యుద్ధంలోకి ఎంట‌ర్ అవుతుందా?

  • ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్.. మెంటర్ బాధ్యతల నుండి తప్పుకున్న పీటర్సన్!

  • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

  • కొత్త అవతారంలో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ EX.. అదిరిపోయే ఫీచర్లు, కొత్త కలర్!

  • ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ట్రైల‌ర్ వ‌చ్చేసిందోచ్‌!!

Trending News

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd