Jupally Krishna Rao : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం పై సందేహం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి
Jupally Krishna Rao : తాను కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 06:38 PM, Fri - 12 September 25

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభుత్వంపై ఆ పార్టీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
School Bus: స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. ప్రమాద సమయంలో 20 మంది!
ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. అందుకే నేను హామీలు ఇవ్వను. నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా” అని ఆయన అన్నారు.
అంతేకాకుండా, తాను కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తానో లేదో తెలియదని మంత్రి జూపల్లి చెప్పుకొచ్చారు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది ప్రజల్లో పార్టీపై ఎలాంటి అభిప్రాయం కలిగిస్తుందో, దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.