HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Harish Rao Fired On Rahul Gandhis Comments

Harish Rao: రాహుల్ గాంధీ వ్యాఖ్యల పై మంత్రి హరీశ్ రావు ఫైర్

తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

  • Author : Balu J Date : 20-10-2023 - 11:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao Cbn
Harishrao Cbn

Harish Rao: తెలంగాణ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఆరు గ్యారెంటీలు, కర్ణాటలో అవినీతి, ఉచిత విద్యుత్, ఇతర అంశాలను పూర్తిగా వివరిస్తూ కౌంటర్ ఇచ్చారు.

1. ఎన్నికలనగానే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ నేతలు వచ్చి వాలుతున్నారు. వాళ్ళు తెలంగాణకు బంధువులు కాదు, ప్రజలను పీడించే రాబంధులు. రాహుల్ గాంధీ వచ్చి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారు. అందుకే రాహుల్ లీడర్ కాదు.. జస్ట్ రీడర్. ఇక్కడ గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామ‌ని రాహుల్ అంటున్న‌రు. అసలు ఏ హోదాతో ఆ మాట చెబుతున్నరు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖ‌ర్గేనా? రాహులా? ప్రియాంక‌నా? ములుగు, మంథని కాదు తెలంగాణలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అభివృద్ధి కండ్ల‌కు క‌డుతుంది. ఏ గడపకు వెళ్ళినా గులాబీ జెండా క‌నిపిస్తుంది. ఏ గుండె చప్పుడు విన్నా జై కేసీఆర్, జై తెలంగాణ అంటుంది.

2. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేశామని రాహుల్ గాంధీ అంటున్నారు. ఏమున్నది కర్ణాటకలో.. రైతులకు ఏడు గంటల కరెంటు ఇస్తమని అధికారంలోకి వ‌చ్చి, ఇప్పుడు 5 గంటల కరెంటు కూడా ఇస్తలేరు. పాపం అక్కడి రైతులు కరెంటు కోసం కన్నీరు మున్నీరవుతున్నరు. అక్క‌డ నిరుటి కంటే కరెంటు ఉత్పత్తి పెరిగినా రైతులకు ఇయ్యకుండా కాంగ్రెస్ ప్ర‌భుత్వం గోసపుచ్చుకుంటున్నది. ఇక్కడ కూడా రైతులకు 3 గంటల కరెంటు చాలు అని రేవంత్ రెడ్డి అన‌లేదా? దీనిని బ‌ట్టి రైతులకు కరెంటు ఇవ్వ‌డం కాంగ్రెస్ కు ఇష్టం లేద‌ని స్ప‌ష్టం అవుతున్న‌ది. వీళ్లను నమ్ముకుంటే.. వీళ్లకు అధికారం అప్పగిస్తే రైతులను బతుకనిస్తారా? మళ్లా దొంగరాత్రి కరెంటు మొద‌ల‌వుతుంది. రైతులు అర్థరాత్రి అపరాత్రి పోలాలకు పోయి పాముకాట్లకు, తేలుకాట్లకు గురవుడు షురూ అవుతుంది. మ‌న రైతుల‌కు ఇదే కావాలా? లేక రైతులే రాజంటున్న కేసీఆర్ పాలన కావాల్నా?  సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కాబ‌ట్టే.. రైతుల కష్టనష్టాలు బాగా తెలుసు కాబట్టే.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారు. కానీ ప్ర‌ధాని మోదీ అది తప్పు అంటున్న‌డు. మోట‌ర్ల‌కు మీటర్లు పెట్టమంటున్నారు. ప్రాణం పోయినా మీట‌ర్లు పెట్ట‌న‌ని సీఎం కేసీఆర్ ఆయ‌న మొఖం మీద‌నే చెప్తే తెలంగాణ‌పై కేంద్రం క‌క్ష క‌ట్టింది. మనకు రూ.25 వేల కోట్లు రాకుండా ఆపింది. అయినా త‌లొగ్గ‌లేదు. అదీ రైతులపై ప్రేమ ఉన్న మన సర్కారు దమ్ము. రైతుల కోసం పథకాలు పెట్టినా.. కేంద్రంతో కొట్లాటకు దిగినా .. ఒక్క కేసీఆర్ కే సాధ్యమైంది.

3. చత్తీస్ గఢ్ లో వరి ధాన్యాన్ని ఎంఎస్పీకి కొంటున్నాం అని రాహుల్ డబ్బా కొట్టుకుంటున్నారు. మరి ఎకరానికి ఎంత కొంటున్నా చెప్పారా? కేవలం ఎకరానికి 15 క్వింటాళ్లు మాత్రమే. మరి ఎకరాకు ఎన్ని క్వింటాళ్లు పండుతయో రాహుల్ కు తెలుసా?. మిగతా ధాన్యానికి ఎందుకు ఎంఎస్పీ ఇవ్వట్లేదో కాంగ్రెస్ చెప్పాలి?. రైతులపై నిజంగా ప్రేమ ఉంటే మొత్తం పంటను ఎంఎస్పీకి కొనాలె కదా? ఆంక్షలు ఎందుకు?. ఇది రైతులను దగా చేయడం కాదా? రాహుల్ గాంధీ ఇదీ మీరు రైతులకు చేసిన ద్రోహం. మన రాష్ట్రంలో రైతులు ఎకరానికి 23-25 క్వింటాళ్లు పండిస్తున్నారు. మన సీఎం కేసీఆర్ గారు.. కాంగ్రెస్సోళ్లలెక్క ఆంక్షలు పెట్ట‌లేదు. కల్లాల దగ్గర్నే పంట మొత్తం కొంటున్నారు. ఆన్ లైన్ లో రైతుల ఖాతాల్లో పైసలు పడుతున్నయి. టంగు టంగుమంటూ పైసలు పడ్డ మెసేజీలు రాంగనే రైతన్నల మొఖంలో ఆనందం వస్తున్నదా లేదా?

4. మాట మాట్లాడితే మేం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం.. తెలంగాణ ఇచ్చినం అని కాంగ్రెస్సోళ్లు అంటున్నారు. 2004లో తెలంగాణ ఇస్తమని కేసీఆర్ గారికి హామీ ఇచ్చి మాతో పొత్తు పెట్టుకున్నారు. మ‌రి అధికారంలోకి రాగానే తెలంగాణ ఇచ్చారా? లేదు. దాన్ని దాటవేసేందుకు.. టీఆరెస్ పార్టీని బలహీనపరిచి తెలంగాణ వాదమే లేదని బుకాయించేందుకు కుట్రలు చేయలేదా? కేసీఆర్ కేంద్రప్రభుత్వం నుంచి ఎందుకు రాజీనామా చేయాల్సిన వచ్చింది? కరీంనగర్ ఉపఎన్నిక లో తెలంగాణ ప్రజలంతా తెలంగాణ సెంటిమెంట్ ను కాంగ్రెస్ కు రుచిచూపించలేదా? ఆ తర్వాత టీఆరెస్ ఎమ్మెల్యేలు, మళ్లీ కేసీఆర్ గారు రాజీనామా చేసి.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని చాటారు. తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. కాంగ్రెస్ కు మరో మార్గం లేక.. తెలంగాణ ప్రకటన చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎట్లా మాట మార్చిందో.. మళ్లీ కేసీఆర్ గారు , ప్ర‌జ‌లంతా కలిసి ఎట్ల కొట్లాడారో లోకమంతటికీ తెలిసిందే కదా. మరి కాంగ్రెస్ మాట నిలబెట్టుకున్నట్టా.. నిలబెట్టుకునేలా కేసీఆర్ గారు, ప్ర‌జ‌లు కలిసి మెడలు వంచినట్టా? రాహుల్ గాంధీ తీరు ఎట్లున్నదంటే.. భారతదేశ స్వాతంత్రం కోసం ఉద్యమాలు, పోరాటాలు చేసినోళ్లదేమీ లేదు కానీ.. ఇచ్చిన బ్రిటీషోళ్లు గొప్పోళ్లు అన్న‌ట్టున్న‌ది. బ్రిటీషోళ్లు గొప్పనా… పోరాటం చేసిన వాళ్లు గొప్పనా? మీరే చెప్పాలి.

5. సీఎం కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేయలేదని రాహుల్ గాంధీ అంటున్నారు. ఒక్కసారి రైతులను అడుగుదామా? ఇచ్చిన మాట మేరకు రెండుసార్లు రైతులకు రణమాఫీ చేసిన ఏకైక సర్కారు.. దేశంమొత్తంలోనే బీఆర్ఎస్‌ ప్రభుత్వమే. ఇచ్చింది సీఎం కేసీఆరే.

6. రాజస్థాన్ లో ఆరోగ్య పథకం ఎంతమందికి ఇస్తున్నారు రాహల్ గాంధీ గారూ. సీఎం కేసీఆర్ తెలంగాణను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దారు. చిన్నపాటి జ్వరాల నుంచి కరోనాలు వచ్చినా కూడా .. తెలంగాణకు వచ్చి ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నరు. మా కేసీఆర్ గారు జిల్లాకో వైద్య కళాశాల పెట్టారు. పెద్ద ఆస్పత్రులు క‌ట్టిస్తున్నారు. హైదరాబాద్ నలుదిక్కులా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నయి. ప్రతీ బస్తీలో బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయి. రాహుల్ జీ.. మీ రాజస్థాన్ లో ఇలాంటివి ఇందులో ఎన్ని ఉన్నాయి. పాలన గురించి మీరు సీఎం కేసీఆర్ గారికి చెప్పేవాళ్లా.
అసలు కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఏముండె .. కనీసం మన బిడ్డలకు మెడికల్ సీట్లు కూడా కేటాయించలేదు. మెడికల్ కాలేజీలు లేవు. ఏపీకి మాత్రం కేటాయించుకున్నరు. అసలు వైద్యరంగంలో తెలంగాణకు అన్యాయం చేసిందే .. కాంగ్రెస్ పార్టీ. వీళ్లు ఇయ్యాల వచ్చి నీతులు పలుకుతున్నరు.

7. ఇక పోడు, అసైన్డ్ భూముల వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నేండ్లు అధికారంలో ఉన్నది . అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూడా చేతిగుర్తోళ్లే ఉన్నరు. ఐనా.. పోడు, అసైన్డ్ లొల్లి ఎందుకు పరిష్కారం కాలేదు? ఎందుకంటే వాళ్ల‌కు చెప్పుడే తప్ప చేసుడు చేత‌కాదు.

8. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమ్మక్క సారక్క జాతరను జాతీయ ఉత్సవంగా ప్రకటిస్తాం అని రాహుల్ గాంధీ చెప్పారు. ఇంతకంటే మోసపు మాటలు ఇంకేముంటయి. సమ్మక్క సారక్క జాతర ఇయాల్నే జరుగుతున్నదా? ఈ దేశానికి స్వాతంత్రం రాకముందునుంచి చేసుకుంటున్నమా లేదా? మరి దేశాన్ని 50 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ కు అప్పుడు మన సమ్మక్క సారక్క జాతర కనిపించలేదు. ఇప్పుడు జాతీయ పండుగ అంటున్నరు. అప్పుడు కనీసం రాష్ట్ర పండుగగా కూడా గుర్తించలేదు. అంటే.. అధికారంలో ఉన్నప్పుడు మన ప్రాంతం, మన సంస్కృతి, మన పండుగ గుర్తుకు రావు. కానీ.. ప్రతిపక్షంలో ఉంటే దొంగనాటకాలాడుతరన్నట్టు.

9. రాహుల్ గాంధీ, ప్రియాంకా రామప్పకు వెళ్లారు. మంచిదే . దేవున్ని దర్శించుకున్నరు. మరి అంత గొప్ప రామప్ప గుడికి మనం ఏం చేశామన్న పాపబీతి వారిలో కలిగిందా? రామప్ప శిల్పాలు, గుడి ప్రపంచ ప్రసిద్ధి దాని బాగోగులు ఈ కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక కదా గుడిని సుందరంగా తీర్చిదిద్ది.. యునెస్కో గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకున్నది. ఇదీ వాళ్లకు మాకు తేడా.

10. బీజేపీకి బీఆరెస్ బీ టీం అని రాహుల్ గాంధీ అంటున‌నారు. కానీ.. వాస్తవమేంటంటే బీజేపీ, కాంగ్రెస్ రెండూ నాణానికి బొమ్మా బొరుసు. ఇద్దరూ దొంగలే. ఇద్దరూ తెలంగాణ ద్రోహులే. హుజూరాబాద్ లో బీజేపీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందా లేదా? బీఆరెస్ పార్టీ ఎవరికీ బీ టీం కాదు.. తెలంగాణ ప్రజలకు ఏ- టీం. మాకు తెలంగాణ ప్రజలే హైకమాండ్. మా ఎజెండా తెలంగాణ అభివృద్ధి.. మా విధానం సంక్షేమం. అందుకే దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అంటే… తెలంగాణలో కేసీఆర్ సర్కారని దునియా మొత్తం కీర్తిస్తున్నది.

Also Read: Gaza Ground Attack : గాజాపై గ్రౌండ్ ఎటాక్.. ఇజ్రాయెల్ ఆర్మీకి కీలక మెసేజ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hard comments
  • harish rao
  • hyderabad
  • rahul gandhi

Related News

International Thalassemia Day

Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆదివారం హైదరాబాద్‌లో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని నెక్లెస్ రోడ్డులో ‘తలసేమియా రన్’ను ఘనంగా నిర్వహించింది. జలవిహార్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. ఈ పరుగులో 3K, 5K, 10K విభా

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Aiadmk Eyes Tvk Alliance

    Vijay TVK: విజయ్‎తో టచ్‎లో 10 మంది ఎమ్మెల్యేలు..!

  • Support from Congress for TVK Vijay

    TVK: టీవీకే కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం!

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd