HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Minister Harish Rao Counters Rahul Gandhi Comments In Twitter

Minister Harish Rao : దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌ల‌పై మంత్రి హ‌రీష్ రావు కౌంట‌ర్

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది అని మంత్రి హ‌రీష్ రావు అన్నారు.

  • Author : News Desk Date : 02-07-2023 - 9:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Harish Rao
Minister Harish Rao

ఖ‌మ్మం జిల్లా (Khammam District) లో జ‌రిగిన తెలంగాణ (Telangana) జ‌న‌గ‌ర్జ‌న బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ వ్యాఖ్య‌ల‌కు మంత్రి హ‌రీష్ రావు ట్విట‌ర్ వేదిక‌గా ఫైర్ అయ్యారు. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది, అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టారు అంటూ హ‌రీష్ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు. మాది పేద ప్రజలకు ఏ టీం. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు.. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టింది అని హ‌రీష్‌రావు అన్నారు. రాష్ట్రంలో పోడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా రాహుల్..? మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరిచ్చేదేంది అంటూ హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ అని హ‌రీష్ రావు విమ‌ర్శ‌లు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంద‌ని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా అంటూ హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. స్కీమ్‌లు, స్కాం ల‌లోఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే అంటూ విమ‌ర్శించారు.

అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా రాహుల్ అంటూ హ‌రీష్ రావు ప్ర‌శ్నించారు. భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడిగితే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు కాంగ్రెసోళ్లు.. ఇప్పుడు రాహుల్ ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు.. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే పసలేని ఆరోపణలు.. ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అంటూ మంత్రి హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు.

Rahul Gandhi: వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్: రాహుల్ గాంధీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Khammam Congress Meeting
  • Minister Harish Rao
  • rahul gandhi
  • Telangana Congress pary

Related News

Trump's harsh comments on India.. Is that why Modi is silent?: Rahul Gandhi asks

Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా

    Latest News

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    Trending News

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd