New Parliament : పార్లమెంటులో రాజదండంపై ఒవైసీ వ్యంగ్యాస్త్రాలు
నూతన పార్లమెంట్ భవన (New parliament) ప్రారంభోత్సవానికి ఎంఐఎం వెళ్ళదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.
- Author : Pasha
Date : 24-05-2023 - 4:47 IST
Published By : Hashtagu Telugu Desk
నూతన పార్లమెంట్ భవన (New parliament) ప్రారంభోత్సవానికి ఎంఐఎం వెళ్ళదని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని ప్రారంభించాలనే నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సర్వాధికారాలు స్పీకర్ కే ఉంటాయని రాష్ట్రపతి కూడా ప్రారంభించేందుకు వీలు లేదన్నారు. విపక్షాలు సైతం రాష్ట్రపతి చేత ప్రారంభించాలని అంటున్నారని.. వారంతా ఆర్టికల్ 53(1) చదవాలని సూచించారు. బుధవారం ఒవైసీ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఒక వేళ పార్లమెంట్ భవనాన్ని స్పీకర్ ప్రారంభిస్తే పాల్గొంటామన్నారు. కొత్త పార్లమెంట్(New parliament) శిలాఫలకం మీద ప్రధాని పేరు తప్పక ఉంటుందని సెటైర్ వేశారు. ప్రారంభోత్సవం విషయంలో ప్రధాని తప్పుకుని.. స్పీకర్ ఓం బిర్లాకు అవకాశం కల్పించి అధికారాల విభజనపై తమకు గౌరవం ఉందని నిరూపించుకోవాలన్నారు. పార్లమెంట్ భవనంలో రాజదండం ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. రాజదండంతో ఈ ప్రభుత్వం అధికారల విభజనపై దాడి చేస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Also read : Sengol In Parliament : కొత్త పార్లమెంట్ లో సెంగోల్ రాజదండం
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ
తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాము 365 రోజులు ప్రజల్లో ఉంటామని అందువల్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎంఐఎం మిగతా పార్టీల మాదిరిగా ఎన్నికల కోసం పని చేయదని ప్రజల కోసం అను నిత్యం పనిచేస్తామమన్నారు. మేము చేసే పనే ఎన్నికల్లో మా గుర్తింపుగా ఉంటుందని చెప్పారు.