KCR : కేసీఆర్‌ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)…కేసీఆర్‌ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు
- Author : Sudheer
Date : 09-12-2023 - 12:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..గాయపడి యశోద హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)…కేసీఆర్‌ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. మళ్లీ యాక్టివ్ రాజీకీయాల్లోకి రావాలని తెలిపారు. గురువారం రాత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడంతో ఆయన తుంటి ఎముక (KCR injures his hip after a fall) విరిగింది.
దీంతో యశోద హాస్పటల్ వైద్య బృందం శుక్రవారం సాయంత్రం తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స చేసారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని డాక్టర్స్ వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని తెలిపారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, మనుమడు హిమాన్షు, ఎంపీ సంతోశ్ కుమార్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. కేసీఆర్ హాస్పటల్ లో చేరిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు , శ్రేణులతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు సైతం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వస్తున్నారు. అలాగే హాస్పటల్ కు కూడా చాలామంది నేతలు వచ్చి పలకరిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Read Also : BRS Party: ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పల్లా, కడియం, కౌశిక్