Meerpet Murder Case : మృతదేహంపై అమానుష చర్యలు.. సంచలన విషయాలు వెల్లడించిన రాచకొండ సీపీ
Meerpet Murder Case : ఈ దారుణ ఘటనపై సీపీ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు మాధవి, గురుమూర్తి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ కారణంగా మాధవిని చంపాలనే ఆలోచనతో గురుమూర్తి ముందుగా ఆమెను కొట్టాడు.
- By Kavya Krishna Published Date - 05:41 PM, Tue - 28 January 25

Meerpet Murder Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీరిపేట్ హత్యకేసు సంబంధించి భర్త గురుమూర్తి తన భార్య వెంకట మాధవిని దారుణంగా హత్య చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. ఈ దారుణ ఘటనపై సీపీ పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. జనవరి 16వ తేదీ ఉదయం 8 గంటలకు మాధవి, గురుమూర్తి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ గొడవ కారణంగా మాధవిని చంపాలనే ఆలోచనతో గురుమూర్తి ముందుగా ఆమెను కొట్టాడు. చెంపపై కొట్టడంతో మాధవి గోడకు తాకి పడిపోయింది. స్పృహ కోల్పోయిన ఆమెను, శరీరంపై కూర్చుని గొంతు పిసికి చంపేశాడు.
Sri Lankan Navy Firing : శ్రీలంక నేవీ ఫైరింగ్.. ఐదుగురు భారత మత్స్యకారులకు గాయాలు
మాధవి మరణం నిర్ధారించుకున్న తర్వాత, గురుమూర్తి ఆమె శరీరంపై ఉన్న బట్టలను తొలగించి, మృతదేహాన్ని బాత్రూంకు తీసుకెళ్లాడు. కిచెన్ నుంచి కత్తిని తీసుకువచ్చి, మొదట మాధవి భుజాలను కట్ చేశాడు. ఆపై చేతులు, కాళ్లను వేరు చేసి ముక్కలు ముక్కలుగా చేసినట్లు సీపీ తెలిపారు. గురుమూర్తి ముక్కలుగా చేసిన శరీర భాగాలను బకెట్లో వేసి వాటర్ హీటర్ ఉపయోగించి ఉడికించాడు. ఆపై ఆ ముక్కలను స్టవ్‌పై ఉంచి మరింత చిన్నచిన్నగా చేసి, ఎముకలను రోటీలో దంచి పౌడర్‌గా మార్చాడు. ఆ పౌడర్‌ను బాత్రూంలో ఫ్లష్ చేయడం, కొన్నింటిని డస్ట్‌బిన్‌లో వేయడం ద్వారా అన్ని ఆధారాలను మాయచేయడానికి ప్రయత్నించాడు.
హత్యకు ముందు గురుమూర్తి తన ఇద్దరు పిల్లలను బంధువుల ఇంటికి పంపించి ఉద్దేశపూర్వకంగా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మాధవిని హత్య చేసిన తర్వాత, పిల్లలను తిరిగి తీసుకొచ్చి తల్లిపై అసత్యాలు చెప్పాడు. మాధవి తనతో గొడవ చేసి ఇంటి నుండి వెళ్లిపోయిందని పిల్లలను, అత్తమామలను నమ్మించాడు.
గురుమూర్తి నేరానికి సంబంధించిన ఆధారాలను తుడిచిపెట్టేందుకు బహుళ ప్రయత్నాలు చేసినప్పటికీ, పోలీసులు 16 వస్తువులను సీజ్ చేశారు. విచారణలో కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసులో భర్త గురుమూర్తి అమానుషంగా ప్రవర్తించి నరరూప రాక్షసుడిలా మారినట్లు పేర్కొన్నారు. ఈ హృదయవిదారకమైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
Black Magic : మంచి మార్కులు వచ్చాయని..విద్యార్థిని పై క్షుద్రపూజలు