HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Medha School Seized

Manufacture of Drugs : మేధా స్కూల్‌ సీజ్‌.. విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

Manufacture of Drugs : ఆదివారం అల్ప్రాజోలం తయారీ కేసులో ఈ పాఠశాలను అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే స్కూల్‌ మూతపడిందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 15-09-2025 - 3:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Medha School
Medha School

హైదరాబాద్‌లోని బోయినపల్లి శ్రీమేధా స్కూల్‌ (Medha School ) వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం ఆందోళనకు దిగారు. ఆదివారం అల్ప్రాజోలం తయారీ కేసులో ఈ పాఠశాలను అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే స్కూల్‌ మూతపడిందని ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో చెప్పాలని, వెంటనే ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్లు (TCs) ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికే 70 శాతం ఫీజులు చెల్లించామని, ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ తక్షణం ప్రత్యామ్నాయ మార్గం చూపాలని కోరారు.

International School Leaders’ Summit 2025 : పాశ్చాత్య దేశాల వైపు చూడటం మానుకోవాలి – ఎంపీ యదువీర్

దర్యాప్తులో స్కూల్‌ యజమాని మలేలా జయప్రకాశ్‌గౌడ్‌ పదినెలలుగా పాఠశాలలోనే అల్ప్రాజోలం డ్రగ్‌ తయారు చేస్తున్నట్టు బయటపడింది. జయప్రకాశ్‌ తన బైక్‌ మీద డ్రగ్స్‌ను సరఫరా చేస్తూ, పాఠశాల నడుస్తున్న సమయంలో రెండు గదులకు తాళం వేసి ఉంచి అక్కడ తయారీ కొనసాగించేవాడని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో శేఖర్‌, గురవారెడ్డి, మురళీసాయి, ఉదయ్‌సాయి సహకారం ఉన్నట్టు ఈగల్‌ టీమ్‌ అధికారులు తెలిపారు. గురవారెడ్డి ఇచ్చిన ఫార్ములాతోనే జయప్రకాశ్‌ స్కూల్‌లో డ్రగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసినట్టు తేలింది.

దర్యాప్తు సందర్భంగా పోలీసులు స్కూల్‌ నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాశ్‌ ఈ మొత్తాన్ని ఫ్యాక్టరీలో పాత పేపర్ల మధ్య దాచినట్టు అధికారులు వెల్లడించారు. మహబూబ్‌నగర్, సంగారెడ్డికి కూడా డ్రగ్స్‌ సరఫరా చేసిన సాక్ష్యాలు దొరికాయి. ఈ ఘటనపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకుంటూ మేధా స్కూల్‌ లైసెన్స్‌ను రద్దు చేసి, పూర్తిగా సీజ్‌ చేసింది. ప్రస్తుతం స్కూల్‌లో చదువుతున్న 130 మంది విద్యార్థులను ఇతర పాఠశాలలో చేర్పించే ప్రక్రియను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా డీఈవో విజయకుమారి పర్యవేక్షిస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Illegal factory inside Hyderabad
  • Manufacture of Drugs
  • medha school
  • medha school bowenpally
  • medha school seized

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Massive blast in Hyderabad's Saroornagar.

    Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

Latest News

  • Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

  • Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

  • Kuppam : అలాంటి ప్రచారాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగదు : సీఎం చంద్రబాబు

Trending News

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd