TSRTC Sensational Announcement : మహిళలకు షాక్ ఇచ్చిన TSRTC
- Author : Sudheer
Date : 23-12-2023 - 1:50 IST
Published By : Hashtagu Telugu Desk
TSRTC మహిళలకు షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు గొప్ప అవకాశం కల్పించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) కింద ఫ్రీ ఆర్టీసీ బస్సు సౌకర్యం (Free Bus for Women) కల్పించింది. ఈ పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ప్రతి రోజు బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. పల్లె వెలుగు , ఆర్డినరీ తో పాటు ఎక్స్ ప్రెస్ బస్సు లోను మహిళకు ఫ్రీ ప్రయాణం కల్పించడం తో అంత ఎక్స్ ప్రెస్ బస్సులకే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. దీంతో దూరం ప్రయాణం చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 , 15 కిలోమీటర్ల దూరం వెళ్లే వారు సైతం ఎక్స్ ప్రెస్ బస్సులో ప్రయాణం చేయడం వల్ల గంటలకొద్దీ దూరం ప్రయాణం చేయాల్సిన వారు సీట్లు లేక..నిల్చుని ప్రయాణం చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్నీ వారు ఆర్టీసీ అధికారులకు విన్నవించడం తో ..ఈరోజు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చిందని , దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని చెప్పారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందన్నారు. ఇక నుంచి ఎక్స్ ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోందని తెలిపారు. మరి దీనిపై మహిళా ప్రయాణికులు ఎలా స్పదిందిస్తారో చూడాలి.
Read Also : BRS ‘Sveda Patras’ : బీఆర్‌ఎస్ స్వేదపత్రం విడుదల వాయిదా