HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Powerpoint Presentation Postponed

BRS ‘Sveda Patras’ : బీఆర్‌ఎస్‌ స్వేదపత్రం విడుదల వాయిదా

  • Author : Sudheer Date : 23-12-2023 - 1:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs Power Point Presentatio
Brs Power Point Presentatio

కాంగ్రెస్ ‘శ్వేత పత్రానికి’ ధీటుగా బీఆర్ఎస్ విడుదల చేయాలనుకున్న ‘స్వేదపత్రం’ (Sveda Patras) రేపటికి వాయిదా పడింది (Postponed ). వాస్తవానికి ఈరోజు ఉదయం 11 గంటలకు స్వేద పత్రాన్ని విడుదల చేస్తామని, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (Power Point Presentation) చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ట్విట్టర్లో ప్రకటించారు. కానీ ఈరోజు అనూహ్యంగా కార్యక్రమం వాయిదా పడింది. రేపు(ఆదివారం) ఈ కార్యక్రమం ఉంటుందని, ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో ‘స్వేదపత్రం’ విడుదల చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.

కేటీఆర్ ‘స్వేదపత్రం’ విడుదల చేస్తామని చెప్పగానే అందరిలో ఆసక్తి మొదలైంది. కేటీఆర్ అసలు చెపుతారో..ఏం చూపిస్తారో..దీనికి కాంగ్రెస్ సమాధానం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొంటారని పార్టీ వర్గాలు కూడా వెల్లడించాయి. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కార్యక్రమం వాయిదా పడింది.

పదేళ్ల కేసీఆర్‌ (KCR) పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెపుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం (Congress Govy) శ్వేత పత్రాన్ని (Swetha Patram) విడుదల చేయగా..తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యయనం అంటూ ప్రజలకు తెలియజేసేందుకు బిఆర్ఎస్ (BRS) ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ (Power Point Presentation) చేయబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్ఠను దెబ్బతీస్తే సహించేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ప‌ల్లె ప్ర‌గ‌తి నుంచి మొదలు టీఎస్ ఐపాస్ వ‌ర‌కు ప్ర‌తి ప‌థ‌కం.. అనేక అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను అందించిందన్నారు. గ‌ణాంకాల‌తో స‌హా.. వాస్త‌వ తెలంగాణ ముఖ‌చిత్రాన్ని వివ‌రిస్తాం. అప్పులు కాదు.. రాష్ట్రం సృష్టించిన సంప‌ద‌ను ఆవిష్క‌రిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల రూపురేఖ‌లు మారిపోయాయని , అనేక సంక్షేమ ప‌థ‌కాల‌తో పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వ‌ర‌కు ఎంతో ప్ర‌యోజ‌నం జరిగిందని, అంత గొప్ప‌గా ప్ర‌జా పాల‌న సాగించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందని కేటీఆర్ తెలిపారు. మరి ఈ ‘స్వేద‌ప‌త్రం’ పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ఎలా ఉండబోతుందో రేపు చూడాలి.

Read Also :AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • BRS Power Point Presentation
  • ktr
  • Sveda Patras

Related News

Harish Rao Kanchukota

Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.

  • Rythubharosa Money

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd